10 Rupee Coins Update: రూ.10 కాయిన్ తీసుకోవడం లేదా.. ఈ రూల్స్‌ను తప్పకుండా తెలుసుకోండి..

10 Rupee Coins: ప్రస్తుతం ఏ కిరణా కొట్టుకు వెళ్లిన పది రూపాయిల కాయిన్‌ ఇస్తే చెల్లదని సమాధానం వినిపిస్తోంది. మీరు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారా..? రూల్స్ ప్రకారం.. రూ.10 నాణేం చెల్లింపులో ఉన్నా.. దుకాణదారులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు చాలా చోట్ల దుకాణదారులు ఈ కాయిన్‌ను తీసుకోకుండా ఇది చలామణి లేదని వినియోగదారులుకు చెబుతున్నారు. కానీ కాయిన్‌ను నిరాకరించిన వారిపైన చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా..? ఇందుకు ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

మన దేశంలో ప్రస్తుత నాణేలలో రూ.10  కాయిన్‌ ఒకటి. రోజువారీ లావాదేవిలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ పది రూపాయిల కాయిన్‌ను చూడగానే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మరి కొందరూ ఈ కాయిన్‌ ప్రస్తుతం చలామణిలో లేదని వాదిస్తున్నారు. 

2 /7

గతంలో కొందరు రూ.10 కాయిన్ చెల్లదని చేసిన ప్రచారం కారణంగా చాలామంది దుకాణదారులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.  ఇక కొన్ని ప్రాంతాల్లో నాణేల కొరత ఉండటం వల్ల దుకాణదారులు చిల్లర ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరూ నకిలీ నాణేల భయం కారణంగా ఈ కాయిన్‌లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. 

3 /7

అయితే రూ.10 కాయిన్ తీసుకోని దుకాణదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. ఈ విషయం చాలామంది దుకాణదారులకు తెలియదు. ఎవరైనా పది రూపాయిల కాయిన్ చెలామణిలో లేదని చెబితే చట్టరీత్యా నేరం కింద పరిగణిస్తారు. దుకాణదారులుపైన ఫిర్యాదు చేయవచ్చు. వారికి శిక్ష కూడా పడుతుంది.   

4 /7

ఎలా ఫిర్యాదు చేయాలి..? దుకాణదారికి ఎలాంటి శిక్ష పడుతుంది..?  పది రూపాయిల నాణేలకు ఎలాంటి నియమాలు ఉంటాయనే వివరాల గురించి ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకోండి.    

5 /7

రూ. 10 కాయిన్‌ను తీసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వెంటనే ఆ వ్యక్తిపైన FIR నమోదు చేయవచ్చు. FIR ఫైల్‌ అయిన తరువాత ఆ వ్యక్తిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా రిజర్వ్‌ బ్యాంక్‌కు ఫిర్యాదు చేయవచ్చు.   

6 /7

ఎవరైనా చలామణిలో ఉన్న నోట్లను, కాయిన్‌లను తీసుకోవడానికి నిరాకరిస్తే వారిపైనా Indian Penal Code లోని సెక్షన్ 489A నుంచి 489E సెక్షన్ల కింద జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. అవసరమైన రుజువులతో వ్యక్తి పైన ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకోవచ్చు.   

7 /7

పది రూపాయిల నాణెలకు సంబంధించి ఆర్‌బీఐ కూడా ప్రకటనలు చేసింది. రూ. 10 కాయిన్‌కి సంబంధించిన వస్తున్న ఫేక్‌ న్యూస్‌లను నమ్మవద్దని చాలాసార్లు కోరింది. కాబట్టి ఎవరైనా పది రూపాయిల కాయిన్‌ తీసుకోవడానికి నిరాకరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. దుకాణదారులు మీరు కూడా ఈ రూల్స్ గుర్తుపెట్టుకుని రూ.10 కాయిన్‌ను తీసుకోండి.