Chandrababu: తిరుమలలో చరిత్ర సృష్టించనున్న చంద్రబాబు.. అత్యధిక సార్లు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం?

Chandrababu Naidu Creates History In Tirumala: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించనున్నారు. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించనున్నారు.

1 /9

Chandrababu Record: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం దసరాకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఉత్సవాల సమయంలో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతాయి.

2 /9

Chandrababu Record: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి.

3 /9

Chandrababu Record: ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు.

4 /9

Chandrababu Record: బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని అర్చకులు, అధికారులు విజ్ఞప్తి చేశారు.

5 /9

Chandrababu Record: ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

6 /9

Chandrababu Record: ఇప్పటివరకు చంద్రబాబు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. తాజాగా జరగనున్న ఉత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో రికార్డు నెలకొల్పనున్నారు.

7 /9

Chandrababu Record: అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టిస్తారని సమాచారం.

8 /9

Chandrababu Record: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రత్యేకత నిలుపుకున్నారు.

9 /9

Chandrababu Record: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా రికార్డు నెలకొల్పుతుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.