Banana Benefits In Telugu: అరటి పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు ఆల్పాహారం తీసుకున్న తర్వాత దీనిని తినడం వల్ల బోలెడు లాభాలు కలగుతాయి. అంతేకాకుండా ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని విముక్తి కలిగిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు వ్యాయామాలు, జిమ్ చేసేవారు రోజు అరటి పండును తినడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు. ఇవే కాకుండా ప్రతి రోజు అరటి పండు తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
అరటి పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు:
ఎనర్జీ బూస్ట్:
అరటి పండులో పొటాషియం, సహజ చక్కెరలు ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీని కారణంగా రోజు ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా జిమ్ చేసేవారికి కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి రోజు వ్యాయామాలు చేసేవారు గంట ముందు తినడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
అరటి పండులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పొట్ట నొప్పి కూడా దూరమవుతుంది.
గుండె సమస్యలకు:
అరటి పండు ప్రతి రోజు తింటే శరీరానికి అధిక పరిమాణంలో పొటాషియం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి6 కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుతుంది.
మూడ్ స్వింగ్స్ తగ్గించడం:
అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా మూడ్ స్వింగ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా మానసిక సమస్యలు దూరమవుతాయి.
కండరాల పెరుగుదల:
ప్రతి రోజు వ్యాయామాలు చేసేవారు అరటి పండ్లు తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం కండరాల పెరుగుదలకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి..:
అరటి పండులో కేలరీలు తక్కువగా..ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టను నిండుగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని వారంటున్నారు.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.