Sukanya Samriddhi Yojana Scheme: సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మోడీ ప్రభుత్వం ఈ స్కీంను 2015 సంవత్సరంలో ప్రారంభించింది. డబ్బుపై ప్రస్తుతం 8.30 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం అన్ని రకాల ప్రభుత్వ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన ను ఎక్కడైనా ఓపెన్ చేయవచ్చు. ఆడపిల్లల పేరిట పుట్టినప్పటినుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా ఈ సుకన్య సమృద్ధి ఖాతాను తెరవచ్చు. ఇందులో కనిష్టంగా 1000 రూపాయలు.. గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు జమ చేసుకోవచ్చు. ఈ ఖాతాను ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల వరకు డబ్బును వెనక్కి తీసుకునే వీలు ఉండదు. . అయితే 18 ఏళ్ల దాటిన తర్వాత మాత్రం అమ్మాయి వివాహం కోసం కానీ చదువు కోసం కానీ 50% వరకు డబ్బులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది.
సుకన్య సమృద్ధి యోజన ఎన్ని ఖాతాలు తెరవవచ్చు:
సుకన్య సమృద్ధి పేరిట ఇద్దరు బాలికలు ఉన్నట్లయితే ఇద్దరి పేరిట తెరవచ్చు వీటిలో వేరువేరుగా డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లయితే మూడో ఖాతా తెరవడానికి వీలు లేదు. సుకన్య సమృద్ధి యోజనను దేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో తెరవగలిగే అవకాశం ఉంది. పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట ఈ ఖాతాలను తెరవచ్చు.
సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి బాలిక బర్త్ సర్టిఫికెట్ అవసరం అలాగే అమ్మాయి ఆధార్ కార్డు, ఎకౌంటు ఎవరు ఓపెన్ చేస్తున్నారో తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతాయి. ఎవరి పేరిట అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వారికి సంబంధించిన రెండు పాస్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీం లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు జమ చేసుకునే అవకాశం ఉంది. 21 సంవత్సరాలు నిండిన తర్వాత బాలిక పేరిట మీరు మొత్తం డబ్బు బయటకు తీయవచ్చు.
సుకన్య సమృద్ధితో 50 లక్షల ఫండ్ ఎలా తయారు చేయాలి:
మీ అమ్మాయి పేరిట 21 సంవత్సరాలు వచ్చే నాటికి 50 లక్షల రూపాయల అతిపెద్ద కార్పస్ ఫండ్ రూపొందించాలి అనుకున్నట్లయితే. ప్రతి సంవత్సరం ఎంత డబ్బు ఈ స్కీమ్లో పొదుపు చేయాలో తెలుసుకుందాం. అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ప్రకారం గమనిస్తే ప్రతి సంవత్సరం రూ. 1,10,000 సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ చేసినట్లయితే, అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే నాటికి. 50 లక్షల కన్నా ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో వడ్డీ రేట్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మెచ్యూరిటీ అనంతరం వచ్చే డబ్బు విషయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.