Navaratri Maha Yogam: ఈ నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై దుర్గామాత అపార కరుణ.. అష్టైశ్వర్యాలు వీరి వెంటే..


Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో  ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.

1 /8

మిథున రాశి.. మిథున రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. నవరాత్రుల నుంచి వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. ఏ పనిచేసిని అదృష్టం వీరి వెన్నంటి ఉంటుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఇది యోగ కాలం.

2 /8

కర్కాటక రాశి.. నవరాత్రి నుంచి కర్కాటక రాశి వారి జీవితంలో అప్పటి వరకు వారి జీవితంలో చోటు చేసుకొని మంచి జరుగుతుంది.  ఉద్యోగంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. మీ మనసు స్థిమిత పడుతుంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

3 /8

సింహ రాశి.. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ గెలుపుకు దోహదం చేస్తాయి.

4 /8

కన్యారాశి.. కన్యా రాశి వారి జీవితం నవరాత్రుల నుంచి మంచి మలుపు తీసుకుంటుంది. ఆర్ధిక వ్యవహారాలు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది.  అంతేకాదు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి.

5 /8

తులా రాశి.. గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న అష్టకష్టాలు నవరాత్రుల నుంచి మటుమాయం కానున్నాయి. కొత్త తరహా జీవితంలో అడుగుపెడతారు. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విజయాలు మీ వశం అవుతాయి. మనసులోని తీరని కోరికలు నెరవేరుతాయి. ఇంటి నిర్మాణాలు కలిసొస్తాయి.

6 /8

ధనుస్సు రాశి.. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అత్యంత శక్తివంతులవుతారు. అందరు మీ మాట ప్రకారం నడుచుకుంటారు. అనుకోని అవాంతరాలు తొలిగిపోతాయి. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి అందుతుంది.  

7 /8

మీన రాశి.. నవరాత్రుల నుంచి  మీ కొత్త జీవితం మలుపు తీసుకుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆస్తులు కలిసొస్తాయి. జీవితంలో  కోరుకున్న పనులు నెవవేరుతాయి.

8 /8

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ప్రస్తావించాము. ZEE News దీనికి ధృవీకరించడం లేదు.