Almonds Precautions: బాదం రోజూ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా, వైద్యులు ఏమంటున్నారు

డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత ఇష్టంగా తినేవి బాదం. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ కారణంగా హెల్తీగా ఉంటారు. అయితే బాదం తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా..వైద్య నిపుణులు ఏమంటున్నారు..

Almonds Precautions: డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత ఇష్టంగా తినేవి బాదం. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ కారణంగా హెల్తీగా ఉంటారు. అయితే బాదం తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా..వైద్య నిపుణులు ఏమంటున్నారు..

1 /7

2 /7

ఎలా నియంత్రించాలి బాదం ఎప్పుడూ తగిన మోతాదులోనే తినాలి. అతిగా తీసుకోకూడదు. తినే ఆహారంలో ఆక్సలేట్ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఆరటి, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్, ఆప్రికాట్, నిమ్మ, ఎగ్స్ వంటివి. బాదంను రాత్రంతా నానబెట్టి తినడం వల్ల ఆక్సలేట్ ముప్పు తగ్గుతుంది. పాలతో కలిపి తీసుకున్నా ఫరవాలేదు.  రోజుకు కనీసం 2.5 లీటర్ల నీళ్లు తాగాలి. ఉప్పు తక్కువగా ఉండాలి. 

3 /7

రోజుకు ఎన్ని బాదం తినాలి రోజుకు 20-23 బాదం పిక్కలు తినడం మంచిది. దీనివల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఉండకపోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి ఉంటే మాత్రం బాదంకు దూరంగా ఉండటం మంచిది

4 /7

ఎవరికి ఎక్కువ ముప్పు బాదం ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో ఆక్సలేట్ రాళ్ల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ప్రత్యేకించి హైపర్ ఆక్సల్యూరియా సమస్యతో బాధపడేవాళ్లకు బాదంతో ముప్పు ఉంటుంది.

5 /7

బాదంతో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి బాదంలో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంతో కలిసి కిడ్నీ స్టోన్స్‌గా మారవచ్చు. అందుకే కిడ్నీ సమస్యలున్నవాళ్లు బాదం ఎక్కువగా తీసుకోకూడదు.

6 /7

వైద్య నిపుణులు ఏమంటున్నారు చాలా వరకూ రాళ్లు యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి. కానీ బయటకు వచ్చే క్రమంలో నొప్పి ఉంటుంది. బయటకు రాలేకపోతే సర్జరీ ద్వారా వాటిని పగలగొట్టి బయటకు తీయాల్సి ఉంటుంది. 

7 /7

బాదం తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా బాదం రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె రోగాలు, బ్లడ్ ప్రెషర్, కేన్సర్ ముప్పు తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ త్గుతుంది. అయితే ఈ బాదం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.