Khairatabad Ganesh:వరుస సెలవులు రావడంతో ప్రజలు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిలిపివేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేశారు. శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దర్శనానికి నిన్న చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిశాయి. భక్తులు రాకతో.. ఖైరతాబాద్లో మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐ మాక్స్ వైపు మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ ను మోనిటరింగ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టారు. కాగా రేపు శోభాయాత్ర తర్వాత… హుస్సేన్ సాగర్‌లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.
రేపు అనంత చతుర్ధశి నేపథ్యంలో మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్ నిమజ్జనానికి 17వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.