Amla 6 Benefits: రోజూ ఆమ్లా తినడం వల్ల శరీరంలో కలిగే మార్పులు ఊహించలేం. అంత అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యపరమైన ప్రయోజనాలకు ఉసిరి కేరాఫ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా విటమిన్ సికు పుట్టినిల్లే ఇది. అందుకే ఉసిరి ఉంటే విటమిన్ సి ఉన్నట్టే అంటారు. రోజూ క్రమం తప్పకుండా ఉసిరి తింటే ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
ఉసిరిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా పెద్దమొత్తంలో ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియ, హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ కోసం అద్భుతంగా దోహదపడతాయి. ఉసిరిని ఆయుర్వేదంలో ఓ దివ్య ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి. అందుకే ఉసిరి రోజూ తినడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు గమనించవచ్చు. ఈ మార్పులు శరీరంపై బాహ్యంగానూ, అంతర్గతంగానూ ఉంటాయి. బాహ్యంగా ఉంటే చర్మ సంరక్షణ, కేశాల సంరక్షణకు ఉపయోగపడతాయి. అంతర్గతంగా వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఉసిరితో ఆరు అద్భుత ప్రయోజనాలు
ఉసిరితో అధిక బరువుకు చెక్ చెప్పవచ్చు. వెయిట్ మేనేజ్‌మెంట్ థెరపీలో ఉసిరి ఉపయోగం కీలకం. ఉసిరి తినడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెంది ఆకలి తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం ద్వారా మధుమేహానికి చెక్ పెడుతుంది. ఇక రెండవ ఉపయోగం హెయిర్ అండ్ స్కిన్ కేర్. ఆయుర్వేదంలో కేశాలు, చర్మ సంరక్షణలో ఉసిరి పాత్రపై చాలా వివరణ ఉంది. అనాదిగా వాడుతూ వస్తున్నారు. కేశాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఉసిరి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఏజీయింగ్ ప్రక్రియను నెమ్మదిస్తాయి.
ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం, కొలాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు స్కిన్ ఎలాస్టిసిటీ మెరుగుపడుతుంది. ఉసిరి రోజూ తినడం వల్ల ఉత్పత్తి అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకం సమస్యను తొలగిస్తాయి. గట్ హెల్త్ సమకూరుస్తాయి.
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు కావల్సినంతగా ఉంటాయి. దాంతో శరీరంలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. క్రానిక్ వ్యాధులముప్పుు తగ్గుతుంది. ఏజీయింగ్ ప్రక్రియ మందగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయి. ఉసిరి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె వ్యాధుల ముప్పు తొలగుతుంది. ఉసిరిని డైట్‌లో చేర్చడం ద్వారా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Poha Benefits: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా తింటే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Amla 6 Benefits: ఉసిరి రోజూ తింటే శరీరంలో ఏమౌతుందో తెలుసా