Blood Pressure Signs: లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్ట్రాల్ ప్రధానమైనవి. ఇందులో ఎక్కువమంది బాధపడుతున్నది రక్తపోటు సమస్యతో. ప్రతి పదిమందిలో ఆరుగురికి కచ్చితంగా బ్లడ్ ప్రెషర్ సమస్య ఉంటోంది. పెద్దలకే కాదు యువకుల్లో కూడా ఈ సమస్య కన్పిస్తోంది. రక్తపోటు ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకుందాం.
బ్లెడ్ ప్రెషర్ సమస్య ఇటీవల పిన వయస్సువారికి సైతం ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. కొంతమందికైతే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, జీన్స్ కూడా కారణం కావచ్చు. అధిక రక్తపోటు సమస్యను తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఒక్క సమస్య ఇతర సీరియస్ సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. వీటి లక్షణాల గురించి తెలుసుకోవాలి.
ఉదయం నిద్ర లేవగానే తల తిరుగుతుంటే అధిక రక్తపోటు సమస్య కావచ్చు. కొంతమందికి బెడ్ నుంచి లేవగానే తల తిరుగుతుంటుంది. మీకు ఈ పరిస్థితి ఎదురైతే వెంటనే బీపీ చెక్ చేసుకోండి. ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఉదయం లేవగానే దాహం తీవ్రంగా ఉండి, నోరు ఎండిపోయినట్టుంటే బీపీ లక్షణం కావచ్చు. శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఇలా అవుతుంది. ఇదేదో సామాన్య లక్షణం అని భావించవద్దు.
ఒక్కోసారి లేదా అనేక సందర్భాల్లో మంచి నిద్ర పట్టినా సరే ఉదయం వేళ తీవ్రమైన అలసట ఉంటుంది. బలహీనత ఆవహిస్తుంటుంది. మీక్కూడా ఇలానే అన్పిస్తే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. రక్తపోటు కారణంగా ఇలా జరగవచ్చు. ఉదయం లేవగానే ఎనర్జీ లేనట్టు అన్పిస్తుంది. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఇక మరో లక్షణం కంటి చూపు మసకగా ఉండటం. ఇది కాస్సేపు మాత్రమే ఉంటుంది. ఈపరిస్థితి మీకు ఎదురైతే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి.
నిద్ర నుంచి లేవగానే ఉదయం వేళ వాంతులు రావడం లేదా వికారంగా ఉండటం ఉంటే బ్లడ్ ప్రెషర్ సంకేతం కావచ్చు. శరీరంలో కావల్సినంతగా రక్తకం సరఫరా జరగకపోతే ఆ వ్యక్తిలో ఆందోళన ఉంటుంది. అశాంతి ఉంటుంది. దాంతో వాంతులు వచ్చినట్టు లేదా వాంతులు రావడం జరగవచ్చు.
Also read: Flipkart Discount offers: సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్ల జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.