Maruti Jimny Discounts: ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్లో కార్లు, బైకులు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. సెప్టెంబర్ నెలలో ప్రస్తుతం మారుతి సుజుకి తన SUV జిమ్నీపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందించింది. మీరు ఈ నెలలో జిమ్నీ కొనుగోలుపై మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. గత కొన్ని నెలలుగా జిమ్నీపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
జిమ్నీపై రూ.2.50 లక్షల డిస్కౌంట్ :
ఈ నెల, మారుతీ సుజుకి జిమ్నీపై రూ.2.50 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ నెలలో, అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్న ఏకైక కంపెనీ మారుతీ. జిమ్నీ టాప్ వేరియంట్ ఆల్ఫాపై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. జీటా వేరియంట్‌పై కంపెనీ రూ.1.95 లక్షల వరకు ఆఫర్ అందిస్తోంది. జిమ్నీ ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల వరకు ఉంది. ఈ వెహికల్లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అంతేకాదు ఇందులో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఇంజిన్ చాలా పవర్ ఫుల్..అన్ని రకాల వెదర్ కండిషన్స్ లోనూ పనిచేస్తుంది. సిటీ, హైవేలో జిమ్నీ పనితీరు చాలా బాగుంది. ఈ కారు ఒక లీటర్లో 16.94 కిమీల మైలేజీని అందిస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా:
మారుతి తన గ్రాండ్ విటారాపై కూడా ఈ నెలలో మంచి డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీపై రూ.1.28 లక్షల వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ హైబ్రిడ్ వెర్షన్ కారుపై అందిస్తోంది. ఇది కాకుండా, మైల్డ్ హైబ్రిడ్‌పై రూ.73,000, SUV CNG వేరియంట్లపై రూ.33,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Also Read : Sukanya Samriddhi Yojana: అలర్ట్..సుకన్య సమృద్ధి నిబంధనలు మార్చిన కేంద్రం.. ఇలా చేయకుంటే ఖాతా క్లోజ్
మారుతి బాలెనో XL6,సియాజ్పై కూడా డిస్కౌంట్ :
ఈ నెలలో మారుతి సుజుకి బాలెనో కొనుగోలుపై రూ.52,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. బాలెనో ఆటోమేటిక్ మోడల్‌పై ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు. మాన్యువల్ మోడల్స్‌పై రూ.47,100 వరకు.. CNGపై రూ.37,100 వరకు డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ నెలలో మారుతీ ఎక్స్ఎల్ 6 పెట్రోల్ వేరియంట్లపై రూ.35,000 సిఎన్‌జిపై రూ.25,000 డిస్కౌంట్ చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మారుతి సియాజ్ కొనుగోలు చేయడం ద్వారా రూ.45,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ.20,000 నగదు డిస్కౌంట్..రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.
ఇగ్నిస్ కొనుగోలుపై రూ.53,100 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ దాని ఆటోమేటిక్ వేరియంట్లపై ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఇగ్నిస్ సిగ్మాపై రూ. 53,100. మాన్యువల్ వేరియంట్లపై రూ. 48,100 బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read : Currency Notes: కస్టమర్లకు ఊరట..చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.