IIFA 2024 Details: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు అలాగే అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నటీనటులకు.. ఐఫా 2024 అవార్డ్స్ ప్రకటించనున్నారు. IIFA 2024 అవార్డ్స్ కార్యక్రమానికి డైనమిక్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే వీరిద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హోస్ట్ గా మారి తమ పర్ఫామెన్స్ తో మరొకసారి అలరించే ప్రయత్నం చేయబోతున్నారు.
సెప్టెంబర్ 27 నుండి సెప్టెంబర్ 29 వరకు అబుదాబిలోని ఐలాండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది.
ఇండియన్ సినీ సెలబ్రిటీలు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వేడుక అబుదాబిలో చాలా గ్రాండ్ గా జరగబోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసింది. ఇక సెప్టెంబర్ 28 శనివారం ప్రతిష్టాత్మకమైన ఐఫా అవార్డులతో ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా సాగుతుంది. ఇండియన్ సినీ సెలబ్రిటీ లతా కూడా ఈ వేడుకలో సందడి చేస్తారు. ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీలను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ సిద్ధం అవుతున్నారు.
ఇకపోతే గల్లీ బాయ్ సినిమాలో ఏం సి షేర్ పాత్ర పోషించినందుకు ఐఫా 2020 అవార్డ్స్ లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్న సిద్ధాంత్ చతుర్వేది, ఐఫా అవార్డ్స్ 2024 24వ ఎడిషన్ లో కార్యక్రమానికి హోస్ట్ గా చేయడం పై తన ఆసక్తిని పంచుకున్నారు. ‘భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక ఇది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి నేను హోస్టుగా చేయబోతున్నందుకు చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాను. 2020లో ఇక్కడే ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోవడం నా కెరియర్ లోనే కీలకమైన ఘట్టం. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తూ ఉండడంతో నా స్థాయి మరింత పెరిగిందని అనిపిస్తోంది. అద్భుతమైన ప్రపంచం అయిన ఐఫా కుటుంబంతో మరొకసారి నా అనుభవాన్ని నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ తెలిపారు సిద్ధాంత్ చతుర్వేది.
మరొకవైపు భారతీయ నటుడుగా క్యాస్టింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ నా ఐఫా ప్రయాణం అసాధారణమైనది. ఈ అద్భుతమైన స్టార్డం ప్రదర్శనలో భాగంగా నేను ఇక్కడికి హోస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఐఫా కుటుంబంలో చేరడానికి నేను సంతోషంగా ఉన్నాను. సెప్టెంబర్ 29న అబుదాబిలో కలుద్దాము అంటూ ఆయన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.