crocodile bites turtle with its jaws shocking video: చెరువుల్లో, నదులల్లో మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా అడవులలో నీళ్లను తాగేందుకు వచ్చిన జంతువులను మొసళ్లు వేటాడుతుంటాయి. నీళ్లలో మొసళ్లలకు పది ఏనుగుల బలం ఉంటుందంటారు.అందుకే భారీ ఏనుగులు, సింహాలు సైతం మొసళ్లను చూసి దూరంగా ఉంటాయి. వాటి జోలికి పోయేందుకు కూడా భయంతో వణికిపోతుంటాయి. ఇదిలా ఉండగా.. మొసళ్లు అనేవి వర్షాలు, వరదల సమయంలో మన ఇళ్లలలోకి ప్రవేశిస్తుంటాయి. నీటి ప్రవాహాంలో కొట్టుకొని వస్తుంటాయి.
— NATURE IS BRUTAL (@TheBrutalNature) September 2, 2024
ఈ నేపథ్యంలో.. కొన్నిరోజులుగాగుజరాత్ లో పదుల సంఖ్యలలో భారీ మొసళ్లు ఇళ్లలోకి వచ్చేశాయి. చాలా మంది వాటిని చాకచక్యంగా పట్టుకుని, చెరువుల్లో వదిలేశారు. మరికొన్ని చోట్ల ఫారెస్ట్ సిబ్బంది సైతం.. మొసళ్లలను చూసి భయంతో దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. మొసళ్లు తరచుగా అడవులలో నీటి ఒడ్డుకు చేరి, వేట కోసం చూస్తుంటాయి.
కొన్ని సందర్భాలలో ఒడ్డున ఉన్న జంతువుల్ని సైతం మొసళ్లు వేటాడుతుంటాయి. ఇదిలా ఉండగా.. ఒక మొసలి ఒడ్డున ఉండి.. వేట కోసం చూస్తుంది. ఇంతలో ఒక తాబేలు అక్కడికి చేరుకుంటుంది.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఒక భారీ మొసలి నీటి ఒడ్డున పడుకుని వేట కోసం వెయిట్ చేస్తుంది. మొసలిని చూసి.. ఏ జంతువూ కూడా అటువైపు వెళ్లే సాహాసం చేయలేదు. ఈ క్రమంలో చాలా సేపటికి పాపం.. ఒక తాబేలు మొసలి సమీపంలోకి వెళ్తుంది. దీంతో మొసలి తన నోరు తెరిచి.. మెల్లగా తాబేలును నోటిలోపలికి తీసుకుంటుంది. కానీ ఇంతలో.. తాబేలు మరల బైటకు వచ్చేందుకు.. ట్రై చేస్తుంది. అప్పుడు మొసలి సెకన్ కాలంలో.. గట్టిగా తన పళ్లతో ఒక్కసారిగా ప్రెస్ చేస్తుంది.
వెంటనే పాపం.. రెండు ముక్కలైపోతుంది. అదేదో.. రంపం మిషిన్ .. మీద కర్ర పెడితే.. అది రెండు ముక్కలు ఏలా అయిపోతుందో.. తాబేలు అలా రెండు ముక్కలైపోతుంది. అంతేకాకుండా.. దాని రక్తం కూడా మొసలి పళ్ల నుంచి ధారగా పడటం కూడా వీడియోలో కన్పిస్తుంది. NATURE IS BRUTAL అనే ఎక్స్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. ‘‘వామ్మో.. మొసలి దవడల పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటనే షాకింగ్ గా ఉంది’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.