Nara Lokesh: 'గుడ్లవల్లేరు కాలేజ్‌లో రహాస్య కెమెరాలు లేవు..ఏం లేవు' మీడియాపై నారా లోకేశ్‌ చిందులు

Nara Lokesh Reacts On Gudlavalleru Engineering College Hidden Cameras: గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాలు లేవని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అదంతా తప్పుడు ప్రచారం చేశారని తప్పుబట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 1, 2024, 04:07 PM IST
Nara Lokesh: 'గుడ్లవల్లేరు కాలేజ్‌లో రహాస్య కెమెరాలు లేవు..ఏం లేవు' మీడియాపై నారా లోకేశ్‌ చిందులు

Nara Lokesh: తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో రహాస్య కెమెరాల సంఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనను ఏపీ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న వేళ ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వసతిగృహాల్లో అసలు రహాస్య కెమెరాలు లేవు' అని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నల వర్షం కురిపించడంతో లోకేశ్ మీడియాపైనే చిందులు వేశారు. ప్రశ్నలు అడిగిన రిపోర్టలపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు.

Also Read: Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు

మంగళగిరిలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆదివారం పరిశీలించిన అనంతరం మీడియాతో నారా లోకేశ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల రహాస్య కెమెరాల అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థుల ఆందోళనపై.. ఆ సంఘటనంపై ఏం చెబుతారని ప్రశ్నించగా లోకేశ్ ఎదురుదాడికి దిగారు. 'అసలు రహాస్య కెమెరాలు లేవు' అని ప్రకటించారు. కెమెరాలు లేనే లేవు అని పలుమార్లు ఆగ్రహంతో చెప్పారు.

Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్‌ అలర్ట్‌.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన

 

'గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాలు లేవు. ఎక్కడా ఒక్క వీడియో బయటకు రాలేదు. విద్యా శాఖ మంత్రిని కాబట్టే నా మీద దృష్టి పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు' అని లోకేశ్ తెలిపారు. 'దొరికిపోయింది. ఏదో అయిపోయింది. ఏదో అయిపోయిందని ప్రచారం. వీడియో ఎక్కడ ఉందంటే ఎవరికీ తెలియదు. కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 300 వీడియోలు బయటకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఒకక వీడియో అయినా ఎవరి చేతుల్లోనైనా ఉందా అంటే లేదు. పిల్లల అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించినా ఒక్క వీడియో లభించలేదు. లేని వీడియోకు నేను ఎలా సమాధానం చెబుతా' అని లోకేశ్ ఎదురు ప్రశ్నించారు.

ఘటనపై కొత్త విషయాలు నారా లోకేశ్ తెలిపారు. 'ఘటన జరిగిందిన కరక్టే. కానీ నలుగురి మధ్యలో వివాదం ఉంది. నలుగురి మధ్య లవ్‌స్టోరీలో ఏ చర్యలు తీసుకోవాలో అధికారికంగా ఆ చర్యలు తీసుకుంటా. కానీ ఈ కాలేజీలో కెమెరా లేదు' అని స్పష్టం చేశారు. మంత్రి ప్రకటన అలా ఉంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. 'మేం ఎలా తప్పు చెబుతాం. కెమెరాలు ఉన్నాయి' అని విద్యార్థులు మాత్రం స్పష్టం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News