లండన్: మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న సెమీస్ పోరులో కివీప్ పై టీమిండియా పై చేయి సాధిస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును భారత బౌలర్లు ఆది నుంచి కట్టదిట్టమైన బంతులతో నియంత్రించగలిగారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సమాయనికి కివీస్ ను భారత బౌలర్లు వంద పరుగుల లోపే (84/2) కట్టడి చేశారు.
భారత బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో కివీస్ బ్యాట్స్ మెన్స్ ఆది నుంచి తడపబడుతూ వచ్చారు. తొలి మూడు ఓవర్లలో 1 /1 స్థితిలో ఉందంటే కివీస్ జట్టు ను భారత బౌలర్లు ఏ స్థాయిలో కట్టడి చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇలా న్యూజిలాండ్ జట్టు తొలి 10 ఓవర్లలో 30 పరుగుల కూడా సాధించలేని స్థితిలో నిలిచింది. దీంతో కివీస్ అనకున్నట్లు ఇంగ్లండ్ ఫార్ములా అమలు చేయడంలో విఫలమైందని చెప్పవచ్చు.
వరల్డ్ లీగ్ దశలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు తొలి పదవి ఓవర్లలో విరుచుపడి కోహ్లీసేనను ఒత్తిడిలో పడేంసింది. ఇదే ఎదురు దాడి వ్యూహాన్ని మ్యాచ్ చివరి వరకు అమలు చేసిన ఇంగ్లండ్ జట్టు కోహ్లీసేన పై 300పైచిలు పరుగులు సాధించింది. ఇదే తరహా ప్లాన్ ను కివీస్ అమలు చేయాలని ఆ దేశ మాజీ క్రికెటర్ డేనియల్ విటోరీ మ్యాచ్ కు ముందు తమ జట్టుకు సలహా ఇచ్చాడు. దీంతో భారత్ పై ఇంగ్లండ్ తరహా వ్యూహాన్ని అమలు చేయాలని కివీస్ భావించింది. అయితే భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్ మెన్ల కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.