BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు..

BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్‌ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్‌లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.
 

1 /5

BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రాముఖ్యత రోజురోజుకు పెరిగిపోతుంది. పెరిగిన టెలికాం కంపెనీల టారీఫ్‌ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలామంది పోర్ట్‌ అయ్యారు. ప్రభుత్వరంగ ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎయిర్‌టెల్‌, జియో, వీఐ కంటే కూడా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది.  బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో మరింత ఆదరణ పొందుతోంది.  

2 /5

ఈరోజు ఆకర్షణీయమైన రెండు రీఛార్జ్ ప్లాన్లను తెలుసుకుందాం. ఈ రెండిటిలో ఏ ప్లాన్‌ బెస్ట్‌ తెలుసుకుందాం. దీంతో మీరు కూడా త్వరగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్ట్‌ అయిపోతారు. రూ. 107, రూ. 153 ప్లాన్ల మధ్య తేడా రూ.46. కానీ, రెండు రీఛార్జీ ప్లాన్లలో ఆకర్షణీయమైన లాభాలను పొందుతారు.  

3 /5

రూ. 107 ప్లాన్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.107 రీఛార్జ్‌ తక్కువ డేటా వాడేవారికి బాగుంటుంది. ముఖ్యంగా ఇది 35 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా ఇతర టెలికాం కంపెనీలు కేవలం 20-28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఇస్తాయి. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ బదులుగా ఇందులో ఏ నెట్‌వర్క్‌ అయినా మీకు 200 కాలింగ్‌ నిమిషాలు మాట్లాడుకోవచ్చు.

4 /5

రూ. 153 ప్లాన్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 153 ప్లాన్ డేటా ఎక్కువగా వినియోగించేవారికి వర్తిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 4 జీ స్పీడ్‌తో 26 జీబీ డేటా పొందుతారు. 26 జీబీ తర్వాత 40 కేబీపీఎస్‌ స్పీడ్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 26 రోజులు. అదనంగా ఈ ప్లాన్‌లో మీరు హార్డీ గేమ్స్‌, ఛాలేంజర్‌ అరెనా గేమ్స్‌, గేమాన్‌, ఆస్ట్రోటెల్, గేమియమ్‌, జింగ్‌ మ్యూజిక్‌, వావ్‌ ఎంటర్‌టైనమ్మెంట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్, లిస్టెన్‌ పొడ్‌క్యాస్ట్ లభిస్తాయి.

5 /5

రెండిటిలో ఏది బెస్ట్‌..? మీకు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే రూ.107 రీఛార్జీ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. మీకు ఎక్కువ డేటాతోపాటు ఇతర ఓటీటీ బెనిఫిట్స్‌ కూడా పొందాలంటే రూ.153 రీఛార్జీ ప్లాన్‌ బెట్టర్.