Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిల్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. 40 ఏళ్లు దాటితే ఈ సమస్య సహజమే కానీ గత కొన్నేళ్లుగా టీనేజ్‌లో కూడా ఈ సమస్య కన్పిస్తోంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్యంలో కూడా కేశాలు బలంగా ఉండేట్టు చేయవచ్చు.
వారంలో రెండు సార్లు ఇలా చేయడం వల్ల కేశాలు రాలడం తగ్గిపోతుంది. అంతేకాదు కొత్తగా హెయిర్ వస్తుంది. అయితే మీ చర్మం పింక్ సాల్ట్, మిరియాలకు సెన్సిటివ్‌గా ఉందో లేదో చూసుకోండి.
ఆయుర్వే్దిక్ పేస్ట్ దీని కోసం సగం స్పూన్ మిరియాల పౌడర్, ఒక స్పూన్ పింక్ సాల్ట్, 3 స్పూన్ల కొబ్బరి నూనె బాగా కలుపుకోవాలి. చేతులతో తలకు పట్టించి కాస్సేపు మస్సాజ్ చేయాలి. ఓ అరగంట తరువాత స్నానం చేయాలి
కేశాల కుదుళ్లు బలోపేతం చేయడం ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, పింక్ సాల్ట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మిరియాలలో ఉంజడే పిపరీన్ అనే పోషకం తలలో రక్త సరఫరాను పెంచుతుంది. కీటాణువుల్ని అంతం చేస్తుంది. పింక్ సాల్ట్ కేశాల్లో వ్యర్ధాల్ని తొలగిస్తుంది
మిరియాలు, రాక్ సాల్ట్, కొబ్బరి నూనె హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు మిరియాలు, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్, కొబ్బరి నూనె కలిపి వాడితే మంచి ఫలితాలుంటాయి. ఈ చిట్కాతో కేవలం వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ సమస్య ఆగుతుంది
వర్షాకాలంలో హెయిల్ ఫాల్ సమస్య ఎలా నియంత్రించాలి వర్షాకాలంలో హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలా మంది కెమికల్ ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల సమస్య మరింత పెరుగుుతుంది. వీటి కంటే వంటింట్లో లభించే పలు పదార్ధాలు అద్బుతంగా పనిచేస్తాయి.
హెయిల్ ఫాల్ కారణం హెయిర్ ఫాల్‌కు చాలా కారణాలుంటాయి. కాలుష్యపూరిత నీళ్లతో స్నానం చేయడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఒత్డిడి వంటివి ప్రధాన కారణాలు. ఈ కారణాలకు చెక్ పెడితే చాలావరకు ఈ సమస్య తగ్గుతుంది