Aishwarya Rai: ఆ బోల్డ్ సీన్స్‌ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ మధ్య చిచ్చు పెట్టాయా..? ఇంతకు ఏం జరిగింది..?

Aishwarya Rai Abhishek Bachchan Divorce Rumors: గత రోజులుగా బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య రాయ్ కలిసి ఉండడం లేదని చాలా రోజుల నుంచి పుకార్లు ఉన్నాయి. ఈ రూమర్లకు బలం చేకూరేలా ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి కూడా వేర్వేరుగా హాజరయ్యారు. రీసెంట్‌గా అభిషేక్ బచ్చన్ ఇటీవల తన తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ నందాతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరితోపాటు ఐశ్వర్యరాయ్ కనిపించకపోవడంతో నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
 

1 /7

అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తరువాత ఐశ్వర్య రాయ్ బి-టౌన్‌కి దూరమైంది. కొన్ని పెద్ద సినిమా ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించాల్సి వచ్చిందట.  

2 /7

బచ్చన్ ఫ్యామిలీకి కోడలు కావడంతో ఎలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించకూడదని కండీషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది.  

3 /7

ఐశ్వర్యకు ఏ దిల్ హై ముష్కిల్ మూవీలో ఆఫర్ రాగా.. ఆమె నటించేందుకు ఒప్పుకుంది. కానీ బచ్చన్ కుటుంబం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.  

4 /7

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సినిమా కథ మొత్తం అభిషేక్ బచ్చన్‌కు చెప్పకుండా ఐశ్వర్య రాయ్ ఆ మూవీలో యాక్ట్ చేసింది.  

5 /7

ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ఐశ్వర్య రాయ్ బోల్డ్ సీన్స్ భారీగా వైరల్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి కుటుంబంలో కలవరం మొదలైంది. ఈ విషయంపై అభిషేక్ సీరియస్ అయినా.. సర్దుకుపోయాడని టాక్ వచ్చింది.  

6 /7

ఇక జయా బచ్చన్, ఐశ్వర్య మధ్య దూరం పెరిగింది. అత్తాకోడళ్ల మధ్య అభిషేక్ బచ్చన్ మౌనంగా ఉండిపోయాడు.   

7 /7

తాజాగా విడాకుల వార్తల నేపథ్యంలో ఆ సినిమా నుంచే ఐశ్వర్యతో బచ్చన్ ఫ్యామిలీకి చెడిందని అంటున్నారు.