Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Aug 29, 2024, 04:46 PM IST
  • సుప్రీంకోర్టులో రేవంత్ కు బిగ్ షాక్..
  • ఓటుకు నోటుకేసులో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం..
Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?

Supreme court serious on Telangana cm revanth reddy: సుప్రీంకోర్టులో ఈరోజు (గురువారం)   2015 లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం మీద విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అందుకు ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున లాయర్ లు సుప్రీంకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

 కేవలంలో ఊహాజనిత అపోహాను బెస్ చేసుకుని .. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయమని కోరడం సరికాదని హితవుపలికింది. దీని వల్ల మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్లుగా ప్రజల్లోకి వెళ్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఈ కేసుపై.. ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఏపీ లేదా తెలంగాణ నుంచి ఒక ప్రాసిక్యూటర్ ను నియమిస్తామని జస్టిస్ గవాయి ధర్మాసనం స్పష్టం చేసింది.

దీనిలో భాగంగా.. ఇరువర్గాల ఏకాభిప్రాయం కోసం.. ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో.. కేసును.. సోమవారం ( సెప్టెంబరు2) కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడిన సుప్రీంకోర్టు..

అంతకు ముందుకు కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్.. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యల పట్ల ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఒక సీఎం స్థానంలో ఉండి.. సుప్రీంకోర్టు ఆర్డర్ లను తప్పుపట్టేలా.. మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తాము రాజకీయ నాయకుల్ని సంప్రదించి బెయిల్ ఇస్తామా..?.. ఎవరి వ్యాఖ్యల్ని పట్టించుకోమని, కేవలం తమ విధినిర్వహణలో భాగంగా.. కేసును బట్టి మాత్రమే తమ చర్యలుంటాయని కూడా ధర్మాసనం తెల్చిచెప్పింది. తాము ప్రమాణ పూర్వకంగా పనిచేస్తామని, ఎవరి పనుల్లో కూడా  జోక్యం చేసుకొమని చెప్పుకొచ్చింది. సీఎం రేవంత్ కు.. సర్వోన్నత న్యాయస్థానం అంటే.. గౌరవం లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more: Rahul Gandhi: ప్రత్యర్థికి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తు హల్ చల్.. వీడియో వైరల్..

కవిత బెయిల్ పై రేవంత్ ఏమన్నారంటే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం రేవంత్ కు ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. దీనిపై రేవంత్ తన దైన విధంగా సెటైర్ లు వేశారు. కవిత బెయిల్ కోసం.. ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ లకు 5 నెలల్లో రాని బెయిల్.. కవితకు ఎలాంటి లాలూచీలు చేస్తే వచ్చిందని రేవంత్ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు మాత్రం ... రేవంత్ పై సీరియస్ అయ్యింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News