iPhone 15 Plus: ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండి

iPhone 15 Plus:  90 వేల రూపాయల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ డిస్కౌంట్ ఉండనుంది. మీరు కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, భారీ డిస్కౌంట్ తో ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు తెలుసుకోండి.  

Written by - Bhoomi | Last Updated : Aug 27, 2024, 11:56 PM IST
iPhone 15 Plus:  ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండి

iPhone 15 Plus Price :  మార్కెట్లో ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ అని చెప్పవచ్చు. ఇది కేవలం స్టేటస్ కోసం మాత్రమే కాదు. దీని పనితీరు కూడా అదే స్థాయిలో ఉంటుంది. హై పెర్ఫార్మెన్స్  అందించడంలో ఐఫోన్ తర్వాతే మరే ఇతర ఫోన్ అయినా అని చెప్పవచ్చు. మార్కెట్లో ఎన్ని ఫోన్లు ఉన్నప్పటికీ, ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మరి ఇతర ఫోన్ కు లభించదు. అనడం అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశం లభించింది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీరు బడ్జెట్‌ ధరలో ఐఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే, మీరు అతి తక్కువ ధరకే  iPhone 15 Plusని కొనుగోలు చేయవచ్చు. iPhone 15 Plus ప్రస్తుతం అమెజాన్‌లో గొప్ప ధరకు అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 15 ప్లస్ (128GB) అమెజాన్ డీల్ ఇదే:

ఇప్పుడు ఐఫోన్ 15 ప్లస్ దాని ధర రూ. 89,900 అయితే ఇప్పుడు 11% డిస్కౌంట్ తో అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. దీంతో దీని ధర రూ. 79,999కి తగ్గింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువధరకు కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే అమెజాన్ మరింత మెరుగైన ఆఫర్‌ అందిస్తోంది. అయితే ఈ ఫోన్ పై మరింత డిస్కౌంట్ పొందాలంటే,  మీరు మంచి కండిషన్‌లో ఉన్న పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, మీకు రూ. 58,700 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్  లభిస్తుంది. ఇది ఈ కొత్త ఫోన్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. అదనంగా, Amazon Pay, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 3,999 వరకు అదనపు డిస్కౌంట్ పొందుతారు. దీంతో ఈ రాయితీలు, ఆఫర్లు అన్నీ కలిపితే ఫోన్ ధర మరింత తగ్గనుంది.

Also Read : SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?  

iPhone 15 Plus స్పెసిఫికేషన్స్ ఇవే:

iPhone 15 Plus ప్రోమో టెక్నాలజీతో కూడిన 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది వెనుక కెమెరా సిస్టమ్ అప్‌డేట్ చేయబడింది. కొత్త 48MP అమీన్ సెన్సార్ ఫోటో  వీడియో నాణ్యతను మెరుగుపరుస్తుంది ఐఫోన్ 15 ప్లస్ లాంగ్ వాలిడిటీ బ్యాటరీతో వస్తుంది. ఇది మీకు రోజంతా చక్కటి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది కొత్త అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉంది.
 

Also Read : Lowest Interest Car Loans:  మీకు నచ్చిన కారు కొనుక్కొండి.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News