Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే సకాలంలో వీటిని గుర్తించి తగిన ఆహారం తీసకుంటే సమస్యకు చెక్ చెప్పవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యులు
ఆధునిక జీవన శైలిలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కారణంగా హెల్తీ ఫుడ్‌కు దూరమైపోతున్నారు. దాంతో విటమిన్ బి12 లోపం ఏర్పడుతోంది. విటమిన్ బి12 లోపం అనేది చాలా రకాల అనర్ధాలకు దారి తీస్తుంది. ఈ విటమిన్ లోపంతో హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, నాడీ వ్యవ్థలో సమస్య వంటి ప్రమాదకర సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే విటమిన్ బి12 లోపాన్ని సకాలంలో గుర్తించగలగాలి. తక్షణం తగిన చర్యలు తీసుకుంటే విటమిన్ బి12 లోపం సరి చేయవచ్చు. మరి మీ శరీరంలో విటమిన్ బి12 లోపముందో లేదో ఎలా తెలుసుకోవడం. ఈ లక్షణాలు కన్పిస్తే తక్షణం అప్రమత్తమవాలి.
ఇటీవలి కాలంలో చాలామంది రాత్రి వేళ నిద్ర త్వరగా పట్టకపోవడం సమస్య ఉంటోంది. శరీరంలో విటమిన్ బి12 లోపం దీనికి కారణం కావచ్చు. అప్పుడప్పుడూ కాకుండా ప్రతి రోజూ ఇదే సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పడుకున్నప్పుడు కాలి నరాలు పట్టేస్తుంటే నిర్లక్ష్యం వహించకూడదు. విటమిన్ బి12 లోపం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన తరువాత కూడా కండరాల్లో నొప్పి లేదా లాగుతున్నట్టు ఉంటుంది. కాలి కండరాల్లో క్రాంప్స్, బలహీనత ఉంటాయి. ఇలా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. విటమిన్ బి12 లోపం కావచ్చు. రాత్రి వేళ కొంతమందికి అదే పనిగా తలనొప్పి బాధిస్తుంటుంది. మీకూ అదే సమస్య ఉంటే విటమిన్ బి12 చెకప్ చేయించుకోవడం మంచిది.
రాత్రి సమయంలో కడుపు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తితే కచ్చితంగా విటమిన్ బి12 లోపం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. వాంతులు, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు.
Also read: Black Raisins Benefits: గర్భిణీ స్త్రీలకు వరంతో సమానం ఈ బ్లాక్ ఫ్రూట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook