Chilli Powder Side Effects: కారం తింటున్నారా? యమ డేంజర్ రా బాబు..

Chilli Powder Side Effects In Telugu: అతిగా కారం తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అడ్డాగా మారుతాయి. అయితే కారాన్ని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 25, 2024, 04:26 PM IST
Chilli Powder Side Effects: కారం తింటున్నారా? యమ డేంజర్ రా బాబు..

Chilli Powder Side Effects In Telugu: నిజానికి ఎంతోమంది ఆహార పదార్థాల్లో కారం ఎక్కువగా తినే ఎందుకు ఇష్టపడుతుంటారు. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అడిగిమరీ ఎక్స్ట్రా వేయించుకొని స్పైసీగా ఆహార పదార్థాలను తింటారు. నిజానికి అతిగా కారం తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో దీనిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లోనైతే కారం ఎక్కువగా తినడం వల్ల పెద్దవారికంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కారాన్ని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు:
కారం ఎక్కువగా తినడం వల్ల చాలామందిలో కడుపులో మంట గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలోనైతే వీరేచనాలు, వాంతులు కూడా కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే అధిక కాలం తింటున్న వారు దీనిని దృష్టిలో పెట్టుకోవడం ఎంతో మంచిది.

అల్సర్: 
కారం ఎక్కువగా తింటున్న వారిలో వచ్చే ప్రధాన సమస్యలను అల్సర్ ఒకటి. మోతాదుకు మించి కారం తినడం వల్ల యువతలో కూడా అల్సర్ వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో రోజురోజుకు అల్సర్ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో అల్సర్ తో పాటు పొట్టలో పుండ్ల వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. 

గుండె సమస్యలు: 
కారం ఎంతో ప్రమాదకరమైందని అందరికీ తెలిసిందే అయినప్పటికీ చాలామంది ఆహార పదార్థాల్లో ఎక్కువగా వినియోగిస్తారు నిజానికి కారాన్ని తినడం వల్ల చాలా మందిలో గుండె సమస్యలు కూడా రావచ్చట. కారంలో ఉండే కొన్ని గుణాలు రక్తనాళాలను సంకోచితం చేస్తాయి. దీని కారణంగా రక్తపోటుతో పాటు గుండె సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. 

చర్మ సమస్యలు: 
కొంతమందిలో చర్మ సమస్యలు రావడానికి ప్రధాన కారణం కారం అతిగా తినడమేనని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. కారం అతిగా తిన్న తర్వాత చర్మంపై దురద ఎర్రబడడం వంటి సమస్యలు వస్తున్నాయట కాబట్టి ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మోతాదుకు మించి కారాన్ని  తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

కళ్ళ సమస్యలు:
కారాన్ని తినడం వల్ల కొంతమందిలో కంట్లో నుంచి నీళ్లు రావడం ఆ తర్వాత దురద రావడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఇలానే జరిగితే కొన్ని నెల తర్వాత కళ్ళు మసకబారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కంటి చూపు నశించిన వారు దీనిని తినడం మానుకోండి. 

నిద్రలేమి సమస్యలు: 
కారం అతిగా తినడం కారణంగా కొంతమందిలో నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు. కారంలో ఉండే మూలకాలు మెదడును ఉత్తేజపరిచి నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా కొంతమందిలో ప్రమాదకరమైన క్యాన్సర్ గా కూడా మారుతుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News