సాయి పల్లవి..ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇట్టే ఇమిడి పోతుంది. డైరక్టర్ ఇలా చెప్పగానే అలా అల్లేసే రకం సాయి పల్లవి. ఒక నటనే కాదు..స్టెప్పు విషయంలో అదుగొడుతుంది. గత మూవీలో ఇది రుజువైంది కూడా... అయితే అసలు పరీక్ష ఇప్పుడు బిగిన్ కానుంది. ఇప్పటి వరకు సాధారణ మూవీస్ లో మాత్రమే సాయిపల్లి నటించింది.చిందులేసింది. అయితే తాజాగా తెరపైకి వస్తున్న మూవీలో ఆమెది ఛాలెంలింగ్ రోల్.
1980 బ్యాక్ డ్రాప్ మూవీ విరాట పర్వంలో సాయిపల్లవిడే కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో ఆమె రెగ్యులర్ లుక్ లో కాకుండా డీ గ్లామరైజ్ క్యారెక్టర్ లో నటించబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఏ స్థాయి నటి అయినా ఇది చాలెంజింగ్ రోలే… అలాంటిది ఈ క్యారెక్టర్ సాయి పల్లవికి వరించింది.
ఈ మూవీలో సాయి పల్లవి డ్యాన్సర్ క్యారెక్టర్. కాబట్టి సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో వేసిన స్టెప్పులు వేరు.. ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ టైమ్ డ్యాన్సర్ గా నటించడం వేరు. ఇది సిసలైన పరీక్ష అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నప్పటికీ సాయిపల్లవి మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వరస చూస్తుంటే సాయిపలవి ఈ పరీక్షలో కూడా ఈజీగా నెగ్గుతుందనే అనిపిస్తుంది.