Gold Rate Today : డబుల్ ధమాకా.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

Today Gold And Silver Rates: దేశంలో బంగారం ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు..ఆ తర్వాత భారీగా పెరిగాయి. శుక్రవారం, శనివారం బంగారం ధరల్లో తగ్గుదల కనిపించంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. 
 

1 /5

Today Gold And Silver Rates: ఆగస్టు 24వ తేదీ పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 72,800కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,800కి చేరింది. ఓవరాల్ గా బంగారం ధర శుక్రవారం తులంపై 400 తగ్గగా..శనివారం 500 తగ్గింది.  బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వెనుక అంతర్జాతీయంగా అలాగే దేశీయంగా ఉన్న కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడానికి అమెరికాలో ప్రధానంగా బంగారం ధరల పెరుగుదల కారణం అవుతోంది.   

2 /5

అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు  బంగారం ధర 2600 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది.  గతవారం 2500 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం రోజుల్లోనే బంగారం ధర సుమారు వందల డాలర్లు పెరిగింది. దీంతో బంగారం ధర దేశీయంగా కూడా పెరుగుతూ వస్తున్నాయి. అటు బంగారం ధరలు భారీగా పెరగటంతో శ్రావణమాసంలో ఇంకొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా వివాహాల  సీజన్ మాత్రం కొనసాగుతూనే ఉంది.    

3 /5

అటు ఆభరణాల మార్కెట్లో కూడా డిమాండ్ భారీగా ఉంది. బంగారం ధరలు  సెప్టెంబర్ మాసంలో విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటినుంచే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్  కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలతో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సాధారణంగా అమెరికా ఫెడరీజరు వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరుగుతాయి.   

4 /5

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇన్వెస్టర్లు కొంత భాగం తమ పెట్టుబడిని బంగారం వైపు ఉంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఎందుకంటే బంగారం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చెబుతూ ఉంటారు. కరోనా సమయంలో కూడా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం పైనే పెట్టుబడి పెట్టారు. ఇక చైనా లాంటి అగ్ర దేశాలు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.   

5 /5

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గత 18 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలో బంగారం కొనుగోలుపై కాస్త బ్రేక్ ఇచ్చింది.  మళ్ళీ ఆగస్టు నెల నుంచి బంగారం  కొనుగోలు ప్రారంభించింది. ప్రధానంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం, అలాగే ఇతర ఒత్తిళ్ల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో చైనా ఎలా పెడ బంగారం కొనుగోలు చేస్తుంది. ఈ పరిణామం ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర మరోసారి రికార్డు స్థాయిలో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.