Rapes in India: పెరిగిపోతున్న హత్యాచారాలు.. ఏ రాష్ట్రం ఎంత.. ఆంధ్రప్రదేశ్ ఎంతంటే..?

Rape Statistics: దేశవ్యాప్తంగా రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  పని ప్రదేశాలలో ఆడవారికి భద్రత లేకుండా పోతోంది. ఒక సంఘటన మరిచేలోపే ఇంకొక సంఘటన వెలుగులోకి వచ్చి, అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే భయపడి పోయేలా చేస్తున్నారు కొంతమంది మానవ మృగాలు. 

1 /4

ముఖ్యంగా ఆడవారికి పని ప్రదేశాలతో పాటు స్వతంత్రంగా బయటకు వెళ్లడంలో కూడా వారికి స్వేచ్ఛ కలిగించాలి. ముఖ్యంగా మహిళలు స్వతంత్రంగా బయట తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల కోల్కతాలోని RG కర్ హాస్పిటల్లో 31 ఏళ్ల మహిళా రెసిడెంట్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన విషాద వార్తలు ప్రస్తుతం దేశాన్ని అట్టుడికిస్తున్నాయి.  

2 /4

ముఖ్యంగా ఈ నేరం వెనుక దుర్మార్గపు కుట్ర ఉందనే పుకార్ల తో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే భారత సుప్రీంకోర్టు తోపాటు న్యాయపరమైన అంశాల నుండి దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.

3 /4

ఇకపోతే 2012 నిర్భయ కేసు నుండి భారతదేశంలో మహిళల భద్రత నిజంగా మెరుగుపడిందా అంటే లేదని చెప్పడంలో సందేహం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 16.6 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. 

4 /4

తెలంగాణలో ప్రతి 10:45 గంటలకు ఒక అత్యాచారం జరుగుతోందని సమాచారం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో  ప్రతి 14:06 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నట్లు సమాచారం.  ముఖ్యంగా రాజస్థాన్ లో 1 గంట 37 నిమిషాలు, మధ్యప్రదేశ్లో ప్రతి రెండు గంటల 57 నిమిషాలకు వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి.