Bank Recruitment 2024: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్, ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉంటే చాలు ఈ ఉద్యోగానికి అర్హత ఉన్నట్టే. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఇండియన్ బ్యాంక్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు స్కేల్ 1 గ్రేడ్‌లో రిక్రూట్‌మెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 300 భర్తీ చేయనున్నారు. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి జూలై 1 నాటికి 20-30 ఏళ్లు మద్యలో వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు వయస్సు, ఫీజులో మినహాయింపు ఉంటుంది. కోటా ఉంటుంది. ఏదో ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది.
ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు జనరల్ కేటగరీ అభ్యర్ధులైతే 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ విద్యార్ధులు మాత్రం 175 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు, ఇతర వివరాలకు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in.సందర్శించాల్సి ఉంటుంది. హోమ్ పేజ్‌లో కన్పించే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుని అక్కడ కన్పించే అప్లికేషన్ ఫిల్ చేయాలి. దరఖాస్తు నింపిన తరువాత ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
ఎంపికైన అభ్యర్ధులకు కనీస వేతనం 48,400 రూపాయలు ఉంటుంది. ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకుంటే దాదాపు 60 వేల వరకు ఉండవచ్చు. గతంలో అన్ని బ్యాంకుల ఉద్యోగాలు బీఎస్ఆర్‌బి రిక్రూట్‌మెంట్ పేరుతో జరిగేవి. ఇప్పుడు బ్యాంకుల వారీగా విడివిడిగా నియామకాలు జరుగుతున్నాయి.
Also read: Public Holidays: ఆగస్టులో మరో లాంగ్ వీకెండ్, స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook