Wedding Diaries: ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేసిన ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..

Wedding Diaries: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఎమ్ వీ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్ఫణలో వెంకట రమణ మిద్దే డైరెక్ట్ చేస్తూ నిర్మించిన చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 21, 2024, 02:37 PM IST
Wedding Diaries: ఆస్కార్ విన్నర్  చంద్రబోస్ విడుదల చేసిన ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..

Wedding Diaries: తెలుగు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా చాందిని తమిలారసన్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ  చిత్రం  చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. తాజాగా ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ఆగస్టు 23న విడుదలవుతోంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ ..
"వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్ ను చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి అవేవి శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వివాహా బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలన్నారు.  హీరోగా యాక్ట్ చేసిన  అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ కి దర్శకుడు వెంకటరమణ మిద్దె ఇవే నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు అందించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఈ నెల ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.  

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ..

ఆస్కార్ అవార్డు విజేత చంద్ర బోస్ మా మూవీ ట్రైలర్ ను రిలీజ్  చేయడం చాలా ఆనందంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల కాబోతుంది. మంచి కుటుంబ కథా చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రమని తెలిపారు.  

ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ..
"వివాహం తర్వాత జీవితంలో   ఎదురైయే ఇబ్బందులు మరియు సవాళ్లను ఈ సినిమాలో చూపించబోతున్నారు. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయిస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని.. జీవితాన్ని మళ్లీ సెటిల్ చేసుకోవాలనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రం ప్రేమ మరియు దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువల నేపథ్యంలో తెరకెక్కించారు.  ఆగస్టు 23 న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News