How to become rich fast: సాధారణంగా ఏ మనిషి అయినా సరే ఉన్నతంగా బ్రతకాలని, అందుకోసం బాగా కష్టపడాలని, డబ్బు సంపాదించాలని, జీవితంలో ఎదగాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా సరే సంతోషంగా బ్రతకడానికి కావాల్సింది డబ్బు మాత్రమే. ఆ డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు. కానీ సరైన మార్గంలోనే వెళ్లాలి. అయితే ఎలా చేసినా సరే మనం ఎక్కువ డబ్బు సంపాదించలేక పోతాం. కానీ కొంతమంది మాత్రం ఇట్టే కోటీశ్వరులు అయిపోతారు.
కోటీశ్వరులందరూ ఒకటే ఫార్ములా ఫాలో అవుతారు. ముఖ్యంగా వారిలో ఉండే కామన్ పాయింట్ వింటే మాత్రం నిజంగా మనం ఆశ్చర్యపోక మానము. మరి నేడు వేలకోట్లకు అధిపతిలై , అందరి చేత కోటీశ్వరులు అని పిలిపించుకుంటున్న వీరి లైఫ్ స్టైల్ ఏంటిది..? వీరిలో ఉండే కామన్ పాయింట్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా కోటీశ్వరుల ఎదుగుదలకు కారణమైన ముఖ్య అంశాలలో మెలుకువ ప్రధానం.. తెల్లవారకముందే నిద్రలేవడం ఒకటి. ఆ సమయంలోనే ఎందుకు నిద్రలేస్తున్నారు? అనే విషయాలు కూడా చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు..ఇలా తెల్లవారకముందే నిద్ర లేవడం వల్ల ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది బిజినెస్ లో ప్రొడక్టివిటీని పెంచడానికి, ఆ సమయంలో నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు కూడా బాగుంటాయనే నమ్మకం వారిలో ఎక్కువగా ఉంటుందట.
ఇంకొకటి సూర్యుడు రాకముందే నిద్రలేచే చాలామంది బిలియనీర్లు ఎక్కువగా ఆ సమయంలో పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారట. అంతేకాదు మెడిటేషన్ కూడా ఎక్కువగా చేస్తారట. కొత్త విషయాలు నేర్చుకోవడానికి తెల్లవారుజామున సమయం చాలా ముఖ్యమైనది. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
తెల్లవారుజామున లేవడం వల్ల మైండ్ ప్రశాంతంగా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారట. ఎందుకంటే ఆ సమయంలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటాయి.కాబట్టి చాలామంది బిలియన్ ఇయర్స్ తెల్లవారుజామున ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అదే వారి సక్సెస్ కి కారణమని సమాచారం.
అంతేకాదు త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే నైట్ లేటుగా నిద్రపోవడం లాంటి లక్షణాలు తగ్గిపోతాయి. ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి పడుకునేలా శరీరాన్ని అలవాటు చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది పైగా ఫిజికల్ ఫిట్‌గా ఉంటారు. మెటబాలిజం దెబ్బతినకుండా ఉంటుంది ఒత్తిడికి దూరం అవుతారు. ఇలాంటివన్నీ కూడా చాలామందిని కోటీశ్వరులుగా మార్చాయి. అంతేకాదు మన పెద్దవాళ్ళు కూడా తెల్లవారకముందే లేచి చదివితే చదివింది గుర్తుంటుందని , పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారని ఊరికే చెప్పలేదు. ఈ విషయాన్ని వారు పాటించారు కాబట్టే నేడు కోటీశ్వరులుగా కొనసాగుతున్నారు.