ఆరు నెలల్లో గ్రామాల్లో మార్పు తథ్యమంటున్న సీఎం కేసీఆర్

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది

Last Updated : Jun 11, 2019, 08:35 PM IST
ఆరు నెలల్లో గ్రామాల్లో మార్పు తథ్యమంటున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక సంస్థల ప్రతినిధులకు తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన  నేపథ్యంలో జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో  కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సంరద్భంగా గ్రామీణావృద్ధి  అంశంపై ప్రజాప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ పార్టీకి గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ లు ఎవరూ గెలుచుకోలేదని తెలిపారు. ప్రజల్లో తమపై నమ్మకం ఉంచి అధికారాన్ని కట్టబెట్టారని..ఇందుకు ప్రతిపలంగా ఆరు నెలల్లో గ్రామాల్లో మార్పు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

పట్టణాలకు ధీటుగా గ్రామీణావృద్ధి...
ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. పట్టణాలకు ధీటుగా గ్రామాణాభివృద్ధి కోసం పాటుపడాలని ఆదేశించారు. తమ పరిధిలో ఉన్న గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తీర్ధిదిద్దేందుకు ప్రతి ప్రజానిధిలు కృషి చేయాలని సూచించారు. ఇందుకోసం పరిషత్ లకు నిధులు అందిస్తామన్నారు. ప్రస్తుతానికి సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ.10 కోట్లు అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు.

పంచాయితీ రాజ్ చట్టంతో విప్లవాత్మక మార్పులు
తెలంగాణలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కొత్త పంచాయతీ రాజ్ చట్టం దోహదపడుతుందన్నారు. దీని ఫలాలను అందరికీ అందచేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదేనని తెలిపారు. ఈ చట్టం క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు జరిగేలా ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఆరు నెలల్లో మార్పు కనిపించాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ కు కారు సదుపాయం కల్పిస్తామని కేసీఆర్ వెల్లడించారు.  

Trending News