Brs Mla Joins Congress: కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు. దానం నాగేందర్ మినహా మిగితా ఎవరూ కూడా పెద్దగా ఆక్టివ్ గా ఎందకు లేరు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిననప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు ఎందుకు వారిలో లేకుండా పోయింది. ఏదో అనుకొని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మరేదో జరిగిందా...వాళ్లు తలిచింది ఒకటైతే మరొకటి జరుగుతుందా..ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు అంతలా డీలా పడడానికి కారణాలేంటి ..?
దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ లో ఉండి అధికారాన్ని చలాయించిన ఎమ్మెల్యేలు .పార్టీ ఓటమి చెందగానే కొంత డిస్సాపాయింట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కొందరు పార్టీనీ పట్టుకొని ఉండగా మరి కొందరు మాత్రం అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కనీసం అధికారం కోల్పోయి నెలలు కూడా గడవకు ముందే ఆ ఎమ్మెల్యేలక ప్రతిపక్షం హోదా రుచించ లేదు. మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండడం పెద్దగా రుచించేలేదేమో వెంటనే కండువా మార్చేదామని డిసైడ్ అయ్యారు కొందరు గులాబీ ఎమ్మెల్యేలు. అనుకున్నదే తడువుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరే సమయంలో మామూలుగా హంగామా చేయలేదు ఆ ఎమ్మెల్యేలు. అభివృద్ది కోసం అంటూ ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు దంచేసి ఎంచక్కా కండువా మార్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా పార్టీలో చేరిన కొత్తలో కొంత ఆక్టివ్ గా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అసలు ఈ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారా అని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ సాగుతుంది.
కాంగ్రెస్ లో చేరక ముందు ప్రతిపక్షంలో ఉన్నా బాగా ఆక్టివ్ గా ఆ ఎమ్మెల్యేలు ఉండేవారట. అదేందో కానీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాక వారు డల్ అయ్యారని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరగుతుంది. అధికార పార్టీలో చేరితే ఎవరైనా ఉత్సాహంగా ఉంటారు కానీ వీళ్లేందీ ఇలా డల్ అయిపోయారు అని గుసగుసలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకున్నా ఇంకా ఆ పార్టీలో వీళ్లు ఇమడలేకపోతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవతున్నాయిట. సాధారణంగానే కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం లాంటి అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేఛ్చ ఉంటుంది. అధిష్టానంతో సంబంధం లేకుండా నేతల తీరు ఉంటుంది. అలాంటిది మొన్నటి వరకు తమ నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ఎమ్మెల్యేలకు ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం గిట్టడం లేదట. కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి ఆ పార్టీలో అంత వరకు అక్కడ ఉన్న పాత నేతలతో ఇంకా సయోధ్య కుదరడం లేదట. ఏదైనా అధికారిక కార్యక్రమం జరిగినా పాత, కొత్త గ్రూపుల మధ్య విభేధాలు ఏర్పడుతున్నాయట. ఇది ఆ ఎమ్మెల్యేలకు పెద్దగా నచ్చడం లేదట.
పార్టీలో చేరే ముందు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పెద్దల నుంచి కొన్ని హామీలు లభించాయిట. అవి కూడా నెరవేరడంలో కొంత ఆలస్యం అవుతుందనే అసంతృప్తిలో ఆ నేతలు ఉన్నారు. అసలు కాంగ్రెస్ లో చేరడం నిర్ణయం సమంజసమేనా అన్న చర్చ తన అనచరులతో చర్చిస్తున్నారట. ఒక వైపు నియోజకవర్గంలో గ్రూపులు, మరోవైపు పార్టీలో చేరే ముందు లభించిన హామీలకు సరైన స్పష్టత లేకపోవడం ఇవన్నీ కూడా ఆ ఎమ్మెల్యేలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయట. దీంతో ఇప్పుడు వారు ఏం చేయాలో తోచక పూర్తిగా సైలెంట్ అయ్యారట. కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండడమే కరెక్ట్ అనే భావనలో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డిపై తమకు భరోసా ఉందని కొన్ని రోజుల వరకు వేచి చూడడమే కరెక్ట్ అని ఆ నేతలు భావిస్తున్నారట.
అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో అలెర్ట్ అయిన రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పోచారంతో పాటు ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు. మీకు నేను ఉన్నా.మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి. మీకు మంచి రోజులు ఉంటాయని రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారట. దీంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు పాటు మౌనంగా ఉండడమే మేలు అని భావిస్తున్నారట. అందుకే వారు ఎక్కడా కూడా ఫోకస్ కాకుండా ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారట. రేవంత్ రెడ్డి చెప్పినట్లు కొద్ది రోజులు వేచి ఉందామని అంతా వరకు సైలెంట్ గా ఉందామని డిసైడ్ అయ్యారట.
ఏదో ఆశించి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ ఎమ్మెల్యేల ఆశలు ఎప్పుడు నెరవేరనున్నాయి..రేవంత్ రెడ్డి వారికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి..పదవులు వచ్చాకే ఆ ఎమ్మెల్యేలు తిరిగి యాక్టివ్ అవుతార లేక ఎందుకులే ఇదంగా మనకు అనుకొని సైలెంట్ గా ఉంటారా అనే వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Telangana Political News: ఆ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి.. వారి ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి..?