Mr Bachchan review: ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. రీమేక్ సినిమాలు తీయడంలో.. కూడా హరీష్ శంకర్ కి ఒక విభిన్నమైన స్టైల్ ఉంటుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్న హరీష్ శంకర్ మంచి డైరెక్టర్ తో పాటు ముక్కు సూటి మనిషి కూడా.
తన ముక్కుసూటి తనం కారణంగా హరీష్ శంకర్ కొన్నిసార్లు వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. ఇక హరీష్ శంకర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ట్రోలర్లు కూడా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చాక చిన్న సెలబ్రిటీ నుంచి పెద్ద సెలబ్రిటీ దాకా అందరి మీద ట్రోల్స్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ చాలామంది వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.
హరీష్ శంకర్ కూడా ట్రోలర్స్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. కానీ తనను ఇబ్బంది పెట్టే ట్రోల్స్ వస్తే మాత్రం కచ్చితంగా వాళ్ళ నోర్లు మూతపడేలాగా జవాబులు ఇస్తూ ఉంటారు. తాజాగా కూడా ట్రౌలర్స్ గురించి మాట్లాడుతూ హరిశంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
నేను ఎప్పుడూ ట్రోల్స్ కి భయపడను ట్రోలర్స్ ఏ నాకు భయపడతారు అంటూ హరీష్ శంకర్ వేసిన పంచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. "సినిమా బాలేదు అంటే అది మొహం మీద చెప్పే వాళ్ళతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. కానీ కొందరు బూతులు వాడుతూ ఉంటారు.. అమ్మానాన్న పేర్లు కూడా తీసుకువచ్చి మరి కామెంట్లు చేస్తారు. వాటిని నేను ఏ మాత్రం సహించను. నా సినిమా నచ్చకపోతే నా గురించి మాట్లాడాలి కానీ నా కుటుంబం గురించి కాదు" అని స్పష్టం చేశారు హరీష్ శంకర్.
చిన్నప్పటినుంచి షారుక్ ఖాన్ అంటే ఇష్టం అని అతనితో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని అన్నారు హరీష్. అంతేకాకుండా "సనాతన ధర్మం మీద కూడా ఒక సినిమా చేయాలని ఉంది. సనాతన ధర్మం అనేది మన జీవన విధానం.. దానిని ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రజలకు చూపించాలి అనుకుంటున్నాను" అని అన్నారు హరీష్ శంకర్.
Read more: Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter