TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..

TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన మహిళందరికీ ఆధార్‌ కార్డు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది.
 

1 /5

రాఖీ పౌర్ణమి ఈనెల 19వ తేదీ సందర్భంగా ఆర్టీసీ మహిళలకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణ మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /5

రాఖీ పండుగ అన్నచెల్లెల్లు ప్రత్యేకంగా నిర్వహించుకునే పండుగ ముఖ్యంగా వారి అనుబంధానికి ప్రతీక. ఈరోజు అన్నకు ప్రతి చెల్లెలు రాఖీ కడుతుంది. జీవితకాలం తనకు రక్షగా అన్న నిలవలాని ఇలా రక్షబంధన్‌ రోజు రాఖీ కట్టుకుంటారు.  

3 /5

అయితే, కొంతమంది అన్నలు, చెల్లెల్లు కొన్ని కారణాల వల్ల కలుసుకోలేకపోతారు. ఉద్యోగాల నేపథ్యంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ అటువంటి సోదరీమణులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది.  

4 /5

రాఖీ పండుగ సందర్భంగా అన్నలను కలవలేని చెల్లెల్లు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే దూరంగా ఉన్న తన అన్నకు రాఖీ పంపించే అద్భుత అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్‌ రాఖీలను డెలివరీ చేసేందుకు శ్రీకారం చుట్టింది.  

5 /5

రేపు అంటే 12 వ తేదీన రాఖీ డెలవరీలకు ఛార్జీలను కూడా చెప్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి వివిధ ప్రాంతాలకు అదే రోజున రాఖీ డెలివరీ చేసే అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.