Chia Seeds Benefits In Telugu: చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారికి ఈ చియా సీడ్స్ ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే తీవ్ర గుండె సమస్యలకు కూడా ఎంతో ప్రభావంతంగా పని చేస్తాయి. అయితే వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడానికి సహాయపడతాయి:
చియా సీడ్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీని కారణంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆహారాల్లో చియాను వినియోగించండి.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి:
చియా సీడ్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎముకలను బలపరుస్తాయి:
చియా సీడ్స్‌లో కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా చేసేందుకు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి:
చియా సీడ్స్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
శక్తిని పెంచుతుంది:
చియా సీడ్స్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అలసట కూడా పూర్తిగా తగ్గుతుంది.
డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి:
చియా సీడ్స్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్‌ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.