Sravana masam saturday 2024: శ్రావణ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా పండుగల మాసమని కూడా చెప్పవచ్చు. శ్రావణ మాసంలో శనివారంకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.
శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక పండుగ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం, శుక్రవారం, శనివారాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా.. ఈరోజున తమ ఇష్టదైవాలను ప్రత్యేకంగా కొలుచుకుంటారు. ఈరోజుల్లో ఉపవాసాలు కూడా చేస్తారు.
శ్రావణ మాసంమంటే శివకేశవులకు ఎంతో ప్రీతీకరమైన మాసం. విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణువును ప్రత్యేకంగా కొలుచుకుంటారు. అంతేకాకుండా.. శనివారం రోజు చాలా మంది ఉపవాసాలు సైతం చేస్తుంటారు. శ్రావణ మాసం శనివారం రోజు కొందరు విష్ణుదేవుడ్ని పూజిస్తే, మరికొందరు నర్సింహా స్వామిని పూజించుకుంటారు. మరికొందరు ఆంజనేయ స్వామిని, శనిదేవుడ్ని సైతం కొలుచుకుంటారు.
ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అత్యంత ఇష్టమైన రోజంట. ఏడు శనివారాల వ్రతం కూడా చాలా మంది ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా పూలతో అలంకరిస్తారు. అంతేకాకుండా.. స్వామివారికి ప్రత్యేకంగా పులిహోర నైవేద్యం చేసి మరీ పెడతారు. పులిహోర, లడ్డు ప్రసాదమంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమంట.
అందుకే తిరుపతిలో ప్రత్యేకంగా లడ్డును,భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఇస్తుంటారు. అంతేకాకుండా.. చాలా మంది పప్పు, బెల్లంలను కూడా వెంకటేశ్వర స్వామికి, నర్సింహా స్వామికి నైవేద్యంగా సమర్పంచుకుంటారు.
ఏలినాటి శని, అర్ధష్టమ, సాడేసాతి శని ప్రభావం ఉన్న వాళ్లు ఏడు శనివారాల వ్రతం చేస్తే ఆదోష ప్రభావమంతా మాయమౌతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలతో పూజలు చేయాలి. శనిదేవుడికి నూనెతో అభిషేకం చేయాలి.
శనివారంరోజున వస్త్రదానం చేయాలి, నవధాన్యాలను దానం చేయాలి. నల్లని వస్తువులను దానంగా ఇవ్వాలి. అదే విధంగా శనివారం రోజున ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నల్లని బట్టలు, నూనెలను మన ఇంటికి తెచ్చుకోకూడదు.. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)