GOAT Spark Song: కోలీవుడ్ స్టార్ తలపటి విజయ్ హీరోగా నటిస్తున్న GOAT సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ అర్థం.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. తమిళం మరో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం.. సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక లిరికల్ వీడియోని.. విడుదల చేసింది చిత్ర బృందం. స్పార్క్ అనే పేరుతో విడుదలైన ఈ పాటలో.. స్పార్క్ లేదు అంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి విజయ్ మంచి డాన్సర్. కానీ కొన్నిసార్లు స్టెప్స్ బాగా లేకపోవడం కారణంగా.. ట్రోల్స్ కి గురవుతూ ఉంటాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అసలు పాట బాగాలేదు అని అభిమానులు ఫీల్ అవుతున్న సమయంలో.. విజయ్ డాన్స్ ఫాన్స్ కి మరింత చిరాకు తెప్పించింది.
స్లో మ్యూజిక్, దానికి విజయ్ వేసుకున్న కాస్ట్యూమ్స్, చేసిన స్టెప్పులు ఏమాత్రం బాగోలేదు అంటూ కామెంట్లు వినిపించాయి. కొందరైతే స్టెప్ కాదు ప్యాంటు మీద సాంబార్ పడితే తుడుచుకుంటున్నట్లు ఉన్నాయి అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. మరోవైపు ఈ ట్రోల్స్ లో కీర్తి సురేష్ పేరు కూడా జత చేసి మరి కొందరు తిట్టిపోస్తున్నారు.
Em music oo em dance oo eediki emaindho pic.twitter.com/MG3soY30X3
— Sun-K🌶️ (@zunkodu) August 3, 2024
ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ చిరంజీవి, విజయలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని అడగగా.. కీర్తి సురేష్ ఒక రెండు సెకండ్లు ఆలోచించి విజయ్ సర్ అని చెప్పేసింది. దీంతో చిరంజీవి కంటే విజయ్ ఎలా బెస్ట్ డాన్సర్ అవుతారు అని.. అలా అనుకునే వాళ్ళకి స్పార్క్ వీడియో చూపించాలి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Orey 💀
Pichi endi idhi 🙏 pic.twitter.com/1US007mIzd— B H A N U ᴼᴳ🥛 (@BhanuPK2929) August 1, 2024
Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..
Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter