Bangladesh Protests Live News: రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బంగ్లాదేశ్ భారీగా నిరసనలు జరుగుతున్నాయి. పౌరుల హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్దరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పౌరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు మొత్తం 300 మందిపైగా చనిపోవడం కలకలం రేపుతోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడి వెళ్లారు. ప్రధాని పదవికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దేశంలో నిరసనలు తారాస్థాయికి చేరడంతో ఆర్మీ రంగంలోకి దిగుతోంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.