Garlic benefits: వెల్లుల్లీలో మన ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అనేక పోషకాలు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు వెల్లుల్లీ తినాలంటారు.
వెల్లుల్లీని చాలా మంది తమ వంటలలో ఉపయోగిస్తుంటారు. కిచెన్ లో వెల్లుల్లీ రెబ్బలు, పేస్టులను వివిధ వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇది ఘాటుగా ఉంటుంది. అంతేకాకుండా వంటలకు మంచి రుచిని కూడా అందిస్తుంది.అందుకే చాలా మంది రోజూ కూరల్లో వీటిని వేసుకుంటుంటారు.
అయితే వెల్లుల్లి వంటలకు రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలును సైతం అందిస్తుంది. అన్నం తినకముందు ప్రతిరోజు మూడు నుంచి ఐదు వెల్లుల్లీ రెబ్బలు తింటే బోలే ఆరోగ్య లాభాలు కల్గుతాయి
వెల్లుల్లి మన శరీరంలో నుంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా తగ్గించేస్తుంది. రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యల్ని కూడా క్రమంగా తగ్గిస్తుంది.
ప్రతిరోజు వెల్లుల్లీని తినేవారిలో.. జీర్ణక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఇవి తిన్న ఆహారంను జీర్ణం చేస్తాయి. నోటిలో నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. పొట్టను ఖాళీగా ఉంచుతుంది.
దీనిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి. మన శరీరంలో ఇమ్యునిటీని యాక్టివేట్ చేస్తుంది.
బీపీ ఉన్నవారు ప్రతిరోజు వెల్లుల్లీ రెబ్బలను తినడం వల్ల క్రమంగా, రక్తపోటు అనేది కంట్రోల్ లో వస్తుందని చెప్తుంటారు. అందుకే బీపీ ఉన్న వారు కూడా ప్రతిరోజు మూడు రెబ్బలు తినాలి.
అంతేకాకుండా.. వెల్లుల్లీ రెబ్బలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు దూరమై.. త్వరగా మంచి నిద్ర పడుతుంది కాబట్టి, మంచి నిద్ర కోసం రాత్రి వెల్లుల్లి రెబ్బలను తినాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా కొత్తగా పెళ్లైనవాళ్లు.. లైంగిక సమస్యలతో బాధపడేవారు... రోజు తప్పనిసరిగా వెల్లుల్లీ రెబ్బతింటే ఉపయోగకరంగా ఉంటుంది. ఇది.. టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. లైంగిక వాంఛలను పెంచుతుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)