Coral Gemstone: ఈ 3 రాశుల వారు పగడం ధరిస్తే వినాశనమే.. ఇందులో మీ రాశి ఉందా? చెక్‌ చేయండి..

Coral Gemstone: రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు కొన్ని రత్నాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న జాబ్‌ పొందుతారు, అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అయితే, కొన్ని రాశులవారికి కొన్ని రత్నాలు వినాశనాన్ని తీసుకువస్తాయి.
 

1 /5

ముఖ్యంగా ఓ 3 రాశులవారు పగడం అస్సలు ధరించకూడదు. పొరపాటున ధరిస్తే వినాశనానికి దారితీస్తుందట. అయితే, రత్న శాస్త్రం ప్రకారం పగడం ధరించకూడని ఆ 3 రాశులు ఏవో తెలుసుకుందాం.  

2 /5

రత్నశాస్త్రం ప్రకారం పగడపు రత్నం ధరించడం వల్ల ఆ వ్యక్తికి బలం, ధైర్య పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పగడం వల్ల ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకున్నది సాధించి ఆ వ్యక్తిని విజయపథంలో నడిపిస్తుంది. అయితే, ఏ రాశి వారు పగడపు ధరించడం మానుకోవాలి తెలుసుకుందాం.  

3 /5

వృషభ రాశి..  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారిపై శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి పగడాన్ని ధరించడం వల్ల కొన్నిసార్లు ఊహించని ఫలితాలు లభిస్తాయి. అయితే, ముందుగా ఏదైనా రత్నాన్ని ధరించే ముందు నిపుణుల అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత గ్రహ స్థానాలు కూడా ప్రభావం చూపుతాయి. జాతకంలో కుజుడు స్థానం బలంగా ఉంటే పగడం ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది, లేదంటే దానికి విరుద్ధ పరిణామాలు జరుగుతాయి. అందుకే ఉంగరం ధరించబోయే వ్యక్తి జాతకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

4 /5

మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మేధస్సు, వ్యాపారం కారకంగా పరిగణించబడుతుంది. అయితే పగడపు రత్నం బుధ గ్రహ ప్రభావం కలిగి ఉంటుంది.అందుకే ఈ రాశివారు పగడం ధరించకూడదు. ఒకవేళ పొరపాటున ధరిస్తే మాత్రం దుష్ప్రభావాలుంటాయి. ఈ రాశివారు ఎట్టిపరిస్థితుల్లో ధరించకూడదు.  

5 /5

కుంభ రాశి..  కుంభ రాశిని శని గ్రహం పరిపాలిస్తుంది.పగడపు రత్నం అంగారక గ్రహాన్ని సూచిస్తుంది . ఈ రెండు గ్రహాల శక్తి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు పగడం ధరించడం మానుకోవాలి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)