Masthu Shades Unnai Ra Movie OTT: కంటెంట్ బాగుంటే సినిమా ఎక్కడ విడుదలైనా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాక ఓపెనింగ్స్ భారీగా ఉండకపోయినా.. ఒక్కసారి ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే పెద్ద సక్సెస్ వైపు పరుగులు పెడతాయి. ఈ క్రమంలో కంటెంట్ బేస్‌గా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..! అనే సినిమా థియేటర్లలో సందడి చేసింది. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అభినవ్ గోమఠం, వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించారు. బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుక్తంగా నిర్మించారు.
Also Read: Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!
ఈ ఏడాది ఫిబ్రవరి 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. చిన్న చిత్రంగా వచ్చినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మార్చి 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా రేర్ ఫీట్‌ను అందుకుంది. 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌తో భారీగా దూసుకుపోతుంది.
కథ ఏంటంటే..?
మిడిల్ క్లాస్ యువకుడు మనోహర్ అలియాస్ మను (అభినవ్ గోమఠం) మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. మనుకు ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే పెయింటింగ్ ద్వారా ఎక్కువగా డబ్బుల రావని.. జీవితం హ్యాపీగా ఉండదని భావించిన పెళ్లి కూతురు.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో లేచిపోతుంది. దీంతో మను క్లాస్మేట్, ధనిక కుటుంబానికి చెందిన రాహుల్(అలీ రెజా).. అతన్ని హేళన చేస్తాడు. దీంతో తెగ ఫీల్ అయిపోయిన మను.. ఎలాగైనా బాగా సెటిల్ కావాలని సొంత ఊళ్లోనే ఓ ఫ్లెక్సీ ఫ్రింటింగ్ షాపు పెట్టాలనుకుంటాడు. అయితే అతనికి వ్యాపారానికి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగులుతుంది. దీంతో మధ్యలోనే బిజినెస్ నిలిచిపోతుంది. అతను ఆడిన ఓ అబద్దం చిక్కుల్లోని నెడుతుంది. మను వ్యాపారాన్ని అడ్డుకునేందుకు రాహుల్ ఏం చేశాడు..? చివరికి మను డబ్బులు సంపాదించాడా..? మను-ఉమాదేవి (వైశాలి రాజ్) మధ్య ప్రేమ కథ ఎలా నడిచింది..? వంటివి తెలుసుకోవాలంటే మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాను చూడనివారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో వెంటనే చూసేయండి.
Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.