Rose Plants: రంగురంగుల గులాబీలు కనివిందు చేయడంతోపాటు...వాటిని చూస్తుంటే మనస్సు ఏదో తెలియని ఆనందం. అయితే చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ కొన్ని మొక్కలు పూలు తక్కువగా పూస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పెరట్లోని గులాబీ మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది. ఆ టిప్స్ ఏంటో చూద్దామా?
Rose Flowering Tips: పువ్వులంటే అందరికీ ఇష్టమే. అందులో రంగురంగుల గులాబీలను చూస్తుంటే మనస్సుకు ఏదో తెలియని హాయి. వాటిని చూస్తుంటే ప్రపంచమే మర్చిపోయినట్లు ఉంటుంది. గులాబీల్లో ఎన్నో రంగులు ఉంటాయి. అందులో రెడ్, పిక్, ఎల్లో అందంగా కనిపిస్తాయి. అయితే చాలా మంది పెరట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. అందులో గులాబీలు తప్పనిసరిగా ఉంటాయి. నగరాల్లో ఉండేవారు కూడా బాల్కానీల్లో పెంచుతుంటారు. అయితే కొంతమందికి గులాబీ మొక్కను ఎలా పెంచాలో తెలియదు. సరిగ్గా పూలు రావడం లేదని అంటుంటారు. ఈ టిప్స్ ఫాలో అయితే మీ ఇంట్లోని గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
సరైన మొక్క: మీరు గులాబీ మొక్కను కొనుగోలు చేసే ముందు అది ఆరోగ్యంగా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. నర్సరీ నుంచి తీసుకువచ్చిన మొక్కను ఇంట్లో నాటుకోవచ్చు.
నేల, మట్టి: మీరు గులాబీని కొనుగోలు చేసిన నాటినప్పుడు మంచి నేల ఉండాలి. సిటీలో నివసించే వారైతే...క్వాలిటీ మట్టిని కొనుగోలు చేయాలి. నేలలో నాటేటప్పుడు గొయ్యిని లోతుగా తవ్వాలి. మొక్క సైజును బట్టి గొయ్యి ఉండాలి. తర్వాత నెమ్మదిగా మట్టితో కప్పిన కవర్ ను తీసి..అందులో నాటాలి. తర్వాత రోజూ నీళ్లు పోయాలి.
ఎరువులు: ఇక మొక్క నాటడమే కాదు దానికి కావాల్సిన ఎరువులను అందించడం చాలా ముఖ్యం. రెడ్ గులాబీ అయితే 6 నుంచి 7గంటల సూర్యరశ్మి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మే మొక్కకు ప్రధాన ఆహారం. ప్రతిరోజూ నీళ్లు పెట్టడంతోపాటు సేంద్రీయ ఎరువులు కూడా ఉపయోగించాలి. మీరు మొక్క నాటిన ప్రాంతం తేమ ఉండేలా చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా నీరు పెట్టకూడదు.
మొక్కల సంరక్షణ: మొక్కలు ఎండిపోయిన పువ్వులు ఉంచకూడదు. వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో ఉంచాలి. మొక్కలను ఎండిపోకుండా కాపాడాలి. మొక్క మరి పెద్దగా పెరగకుండా..మరి చిన్నగా ఉండకుండా కట్ చేస్తుండాలి.ఈ టిప్స్ ఫాలో అవుతే పూలు ఎక్కువగా వస్తాయి.