First Mobile Phone Call: ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. క్షణాల్లో సమాచారం మారుతోంది. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ తప్పకుండా కన్పిస్తోంది. ఇండియాలో ఈ మార్పు ఎన్ని రోజుల్లో..ఎన్ని నెలల్లో, ఎన్నేళ్లలో జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు. ఇండియాలో మొబైల్ విప్లవానికి ఇవాళ్టికి సరిగ్గా 30 ఏళ్లు. మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
First Mobile Phone Call: ఇండియా ఇప్పుడు దాదాపుగా డిజిటల్ మయమైంది. మొబైల్ ఫోన్ ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి. మొబైల్ తయారీ, వినియోగంలో ప్రపంచంలో చైనా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఇండియా. అసలు దేశంలో తొలిసారిగా మొబైల్ ఎప్పుడొచ్చింది, తొలి కాల్ ఎప్పుడు చేశారు, ఎవరు ఎవరికి చేశారో తెలుసా..
1995లో తొలి ఫోన్ కాల్ చేసింది గానీ రిసీవ్ చేసుకుంది గానీ ప్రధాన మంత్రి లేదా రాష్ట్రపతి కానే కాదు. దేశంలో తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసుకున్నది అప్పటి కేంద్ర టెలీకం శాఖ మంత్రి సుఖ్ రామ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు. కోల్ కత్తాన నుంచి అప్పటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు నోకియా మొబైల్ ద్వారా అప్పటి కేంద్ర టెలీకం మంత్రి సుఖ్ రామ్ కు ఫోన్ చేశారు.