ITR Filing: జూలై 31 తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం.? అయితే కండీషన్స్ అప్లై..!!

 ITR : ఐటిఆర్ ఫైల్ చేయడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు ఛాన్స్ ఉంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Jul 29, 2024, 05:25 PM IST
 ITR Filing: జూలై  31 తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం.? అయితే కండీషన్స్ అప్లై..!!

ITR filing deadline: ఐటిఆర్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 ముగిసిపోయేందుకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ తేదీలోపు మీరు ఖచ్చితంగా  ITR ఫైల్ చేయవలసి ఉంటుంది. మీరు ఆలస్యం చేస్తే జూలై 31 తర్వాత పెనాల్టీ సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినవారు పెనాల్టీ చెల్లించి ఫైల్ చేయాలి. కానీ కొంత మందికి మాత్రం ప్రత్యేక గడువు  ఉంది. వీరు చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.

జూలై 31 తర్వాత ఎవరు ITR ఫైల్ చేయవచ్చు:

వ్యాపారస్తులు లేదా ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వ్యక్తులకు ITR ఫైల్ చేయడానికి గడువు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యక్తులు అక్టోబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వీరికి 3 నెలల అదనపు సమయాన్ని ఇస్తుంది, తద్వారా వారు గుర్తింపు పొందిన CA ద్వారా  ఆడిట్‌ రిపోర్టు పొందవచ్చు. ఆ తర్వాత వారు తమ ITRను ఫైల్ చేయవచ్చు.

Also Read : 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. కొత్త పే కమిషన్‌పై బిగ్‌ అప్‌డేట్

నవంబరు 30 వరకు ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఉంది:

అలాగే కొన్ని రకాల లావాదేవీల కోసం ITR ఫైల్ చేయడంలో సడలింపు అందుబాటులో ఉంది. అంతర్జాతీయంగా చేసే వ్యాపార లావాదేవీలపై ఐటీఆర్ ఫైల్ చేయవలసి వస్తే, అటువంటి వ్యాపారానికి ITR ఫైల్ చేయడానికి అదనపు సమయం లభిస్తుంది. అలాంటి వారు నవంబర్ 30 వరకు తమ రిటర్నులను దాఖలు చేయవచ్చు. అంతర్జాతీయ లావాదేవీలే కాకుండా, కొన్ని రకాల దేశీయ లావాదేవీలలో కూడా ఇటువంటి సడలింపు అందుబాటులో ఉంది. 

ఇక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, గడువు తేదీ తర్వాత అతను ఐటీఆర్ ఫైల్ చేస్తే, అతను రూ. 5,000 వరకు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సంపాదన రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆలస్య రుసుము కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు గడువు తేదీ జూలై 31 లోపు ఆదాయపు పన్ను దాఖలు చేస్తే, మీరు పెనాల్టీని తప్పించుకోవచ్చు.

Also Read : Stock Market: లాభాల్లో మార్కెట్లు ..ఆల్ టైమ్ హై రికార్డ్‎ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్ట స్థాయికి నిఫ్టీ..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News