Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలు ఆమె. ఆమె 580-27x స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. క్యాలిఫికేషన్ రౌండులో 580 పాయింట్లతో మూడో స్థానలో నిలిచిన మనుభాకర్..ఫైనల్ కు క్వాలిఫై అయ్యింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్యాలిఫికేషన్ లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానికి పరిమితం అయ్యారు.
దీంతో తొలిరోజు షూటింగ్ లో భారత ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28 ( ఆదివారం) మధ్యాహ్నం 3.30గంటలకు షురూ అవుతుంది. ఇందులో మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరి క్రీడాకారిణి మేజర్ వెరోనికా, రెండో స్థానంలో నిలిచిన హో యే జిన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనే అవకాశం ఉంది.కాగా ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిన్ వలరివన్, సందీప్ సింగ్, రిమిత, అర్జున్ జబుతా జోడులు నిరాశపరిచాయి. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్ జోత్ సింగ్, అర్జున్ చీమా కూడా పైనల్ కు చేరుకోలేకపోయారు.
𝗙𝗿𝗼𝗺 𝗧𝗼𝗸𝘆𝗼 𝗵𝗲𝗮𝗿𝘁𝗯𝗿𝗲𝗮𝗸 𝘁𝗼 𝗣𝗮𝗿𝗶𝘀 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲: 𝗜𝘁'𝘀 𝘁𝗶𝗺𝗲 𝗳𝗼𝗿 𝗠𝗮𝗻𝘂 𝗕𝗵𝗮𝗸𝗲𝗿'𝘀 𝗿𝗲𝗱𝗲𝗺𝗽𝘁𝗶𝗼𝗻! 🇮🇳👇
🇯🇵 𝗧𝗼𝗸𝘆𝗼 𝟮𝟬𝟮𝟬, 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝟭𝟬𝗺 𝗔𝗶𝗿 𝗣𝗶𝘀𝘁𝗼𝗹 𝗤𝘂𝗮𝗹𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻
19-year-old Manu Bhaker scores 98/100… pic.twitter.com/nipwBpbYgc
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
Also Read : National Pension Sceme: NPS పథకంలో వచ్చిన మార్పులు ఇవే...ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter