Liquor Shops Closed For 2 Days: రెండు రోజులపాటు బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Liquor Shops Closed For 2 Days: ఆషాఢమాసం బోనాలు చివరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా రెండు రోజులపాటు లిక్కర్ షాపులు బంద్ పాటించనున్నారు.
ఆదివారం 28వ తేదీ బోనాలు, 29వ తేదీ అంబారీపై అమ్మవారి ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నాన్ ప్రొప్రైటరీ క్లబ్స్, స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలో కూడా మందు విక్రయాలు జరగవు.
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు 24 గంటలపాటు, సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని లిక్కర్ షాపులు రెండు రోజులపాటు మూసి ఉండనున్నాయి. ఈ బంద్ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జరుగనుంది.
సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో ముఖ్యంగా చంద్రాయాణగుట్ట, బండ్లగుడ, సౌత్ జోన్ పరిధిలోని చార్మినార్, కమాఠిపురా, హుస్సేయినీ అలాం, ఫలక్‌నూమా, మొఘల్‌పురా, చత్రినాక, శాలిబండా, మీర్ చౌక్ తదితర ప్రాంతాల్లోకి వస్తాయి.
కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి సెక్షన్ 20 తెలంగాణ ఎక్సర్సైజ్ యాక్ట్ (Act No.06 of 1974) ప్రకారం హైదరాబాద్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్స్ అన్ని బంద్ పాటించాలని మీడియా ముఖంగా వెల్లడించారు.