అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో టబు !

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో టబు !

Last Updated : Apr 14, 2019, 02:30 PM IST
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో టబు !

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ఇవాళ లాంచ్ అయింది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది 19వ సినిమా కాగా.. జులాయి, s/o సత్యమూర్తి చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేయడం ఇది మూడోసారి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ( చినబాబు), గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన పూజా హెగ్డె జంటగా నటించనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునిల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాతో టబు కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇవ్వనుంది.

Trending News