Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే. అందులో అల్లం, పసుపు బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight Loss Drink:అల్లం, పసుపు ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా వంట రుచిని పెంచడమే కాదు..అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతాయి. షుగర్, జలుబు, కీళ్లనొప్పులు, ఫ్లూ ఇలాంటి లక్షణాలను తగ్గించే గుణాలు వీటిలో ఉన్నాయి. వేడినీరు, పాలలో అల్లం ముక్క, కొద్దిగా పసుపు వేసుకుని తాగినట్లయితే శరీరానికి ఎన్నో ఔషధ గుణాలు అందుతాయి. అంతేకాదు శరీరంలోని లివర్ డిటాక్సీఫై చేస్తుంది. అయితే అధిక బరువుతో బాధపడేవారు పసుపు, అల్లంతో చేసిన డ్రింక్ తాగితే బరువు తగ్గుతారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
యాంటీఆక్సిడెంట్లు: అల్లం, పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ డ్రింక్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ లెవల్స్ ను పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తుంది.
హెల్తీ డ్రింక్ : అల్లం, పసుపు ఈ రెండింటితో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాబట్టి తాజా అల్లం, పసుపుతో చేసిన డ్రింక్ బరువు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అల్లం : అల్లంలో మంచి పోషకాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల సమయంలో మెరుగైన ఆరోగ్యం కోసం ఇది బెస్ట్ హెర్బ్. ఇందులో జింజిరాల్, ఇతర పోషకాలు ఇమ్యూనిటి, జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి.
పసుపు: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తాజా పసుపులో కర్కుమిన్ తోపాటు మరెన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇమ్యూనిటీనికి పెంచడంతోపాటు వాపును తగ్గిస్తుంది. అంతేకాదు గొంతు చికాకును కూడా నివారిస్తుంది.
బరువు తగ్గడానికి : అల్లం, పసుపు ఈ రెండు అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ డ్రింక్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ ఆరోగ్యం: అల్లం, పసుపుతో తయారు చేసిన ఈ డ్రింక్ తాగడం వల్ల అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి. గుండె ఆరోగ్యం, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బ్లడ్ షుగర్: ఈ రెండు అద్భుతమైన పదార్థాలతో తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల ఇన్సులిన్ మెరుగ్గా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.
ఈ డ్రింక్ ఎలా రెడీ చేయాలి: ఒక అంగుళం సన్నగా తరిగిన అల్లం, హాఫ్ స్పూన్ పసుపును తీసుకుని 2 లేదా 3 కప్పుల నీటిలో మరిగించాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగిన తర్వాత వడకట్టి అందులో తేనె కానీ నెయ్యి కానీ కలుపుకుని తాగాలి.