RGI Airport Passengers: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య విమానయాన రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆన్‌లైన్ వ్యవహారాలు నడవకపోవడంతో విమాన ప్రయాణాలు దాదాపుగా రద్దవుతున్నాయి. టికెట్ బుకింగ్, బోర్డింగ్ పాసుల జారీ, విమానాల రాకపోకలు వంటివి వివరాలు తెలియడం లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సరైన సమాచారం తెలియక విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానయాన శాఖ రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలకు సమయం పడుతుండడంతో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన సమయం వచ్చినా కూడా ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు విమానయాన సిబ్బందితో గొడవకు దిగారు.
Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్ ఎదుట రైతుల ధర్నా
మరికొందరు ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్‌పోర్టు ఆవరణలోనే ధర్నాకు దిగారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నా పరిస్థితి సద్దుమణగడం లేదు. దేశ, విదేశీ ప్రయాణికులు ఉండడంతో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు దేశం, ప్రపంచం మొత్తం ఈ సమస్య ఉందని వివరిస్తున్నారు.
కానీ ప్రయాణికులు మాత్రం తాము తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నా ఏమిటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు విమాన ప్రయాణం సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే ఎంత డబ్బయినా ఇస్తామని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పౌర విమానయాన శాఖ ఈ వ్యవహారంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిష్కారం కాని సమస్య?
విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏర్పడి దాదాపు 10 గంటలయినా ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో యావత్ ప్రపంచం కుదేలైంది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో బ్యాంకింగ్, విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ప్రభావానికి గురయ్యాయి. పెద్ద ఎత్తున విమాన సర్వీసులు రద్దయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు భారత్‌లో ఆయా విమాన సంస్థ తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. అకస్మాత్తుగా విమానాలు రద్దవడం.. ఆలస్యంగా బయల్దేరడం వంటి వాటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి