Constipation Tips: మలబద్ధకం సమస్యను నూటికి నూరు శాతం తగ్గించే 5 అద్భుత చిట్కాలు

How to manage constipation: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ఇటీవలి కాలంలో ప్రదాన సమస్యగా మారిపోయింది. అగ్రరాజ్యంలో అయితే 20 శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారట. ఇదొక తీవ్రమైన సమస్య. మరి ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కే మార్గాల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.

Natural Remedies to check constipation: క్రానిక్ ఇడియోపతిక్ కాన్స్టిపేషన్ అనేది కారణం తెలియని తీవ్రమైన సమస్య. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు జీవనశైలిపై ప్రభావం పడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగని మలబద్ఘకం సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సహజసిద్ధమైన పద్ధతులున్నాయి. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

1 /5

మలబద్ధకం నివారించేందుకు మరో మంచి పద్ధతి నెయ్యి. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేవుల్లో మెటబోలిజం వృద్ధి చెందుతుంది. స్టూల్ మూమెంట్ మెరుగుపడుతుంది. రోజూ రాత్రి వేళ ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే ఉదయం ఫలితం బాగుంటుంది

2 /5

ఈ అధ్యయనం ద్వారా ఫ్లక్స్ సీడ్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల బౌల్ మూమెంట్ గణనీయంగా పెరిగి మలబద్ధకం సమస్యను తగ్గించినట్టు తేలింది. ఫ్లక్స్ సీడ్స్ లో సాల్యుబుల్ ఫైబర్ గణనీయంగా ఉంటుంది. ఇది మీరు విసర్జించే స్టూల్ మృదువగా చేస్తుంది. 

3 /5

ఫ్లక్స్ సీడ్స్, యోగర్ట్, నెయ్యి తినడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.

4 /5

సాధ్యమైనంతవరకూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, లెజ్యూమ్స్, తృణ ధాన్యాలు డైట్ లో తప్పకుండా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా తగిన వ్యవధిలో వ్యాయామం చేస్తుండాలి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

5 /5

అన్నింటికంటే ముఖ్యమైంది మలబద్ధకం నియంత్రించాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్ ఓ ప్రధాన కారణం కావచ్చు. రోజూ తగినంతగా నీళ్లు తాగకపోతే విసర్జన కష్టమైపోతుంది. ఫలితంగా నొప్పి, బ్లోటింగ్ కు దారితీస్తుంది.