ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ చొరవ తీసుకుంటున్న తీరు ...రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. ఒకవైపు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతూ... మరోవైపు వైసీపీకి మద్దతుగా నిలవడం...చంద్రబాబుకు శాపనార్థాలుపెడుతూ ... జగన్ పై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు కేసీఆర్. ఒక వైపు లోక్ సభ ఎన్నికల్లో బీజీగా ఉన్నప్పటికీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేస్తుండతో అసలు ఆయన మదిలో ఏముందనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. అసలు కేసీఆర్ ఎలాంటి రాజకీయ వ్యూహంతో ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
చంద్రబాబు గెలుపుతో కారుకు బ్రేకులు
ఏపీలో చంద్రబాబు మళ్లీ గెలిస్తే కారు జోరుకు బ్రేకులు పడతాయనే రాజకీయవర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీడీపీ గెలిస్తే మళ్లీ తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునేందుకు అవకాశం దొరుకుందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు దారుణంగా పడిపోతుందని.. అక్కడ బీజేపీకి ఆదరణ కరువైంది. ఇలాంటి తరుణంలో టీడీపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవరిస్తుందనేది కేసీఆర్ భయమనే వాదన వినిపిస్తోంది.
వైసీపీ విన్ అయితే కేసీఆర్ గుప్పిట్లో ఏపీ
టీడీపీ కాకుండా.. జగన్ పార్టీ గెలిస్తే ఏపీ ఆయన గుప్పిట్లోకే వచ్చినట్టవుతుందనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్లలేని స్థితిలో వైసీపీ ఉంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు సాధించుకోవాలంటే జాతీయ స్థాయిలో ఏదైన కూటమితో చేయికలపాల్సి వస్తుంది. అలాంటి తరుణంగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటే ఒక్కటే వైసీపీ ముందు ఆప్షన్ గా ఉంటుంది. అప్పుడు జగన్ పార్టీ.. కేసీఆర్ మద్దతు కోరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాను ప్లాన్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు బలం చేకూరుతుందనేదే కేసీఆర్ వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఫ్రంట్ విషయం అంటుంచితే... తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు అడుగడుగున అడ్డుతగులుతున్నారని..అదే జగన్ అయితే ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్న కేసీఆర్ ..జగన్ కు మద్దతు తెలుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ ఏపీకే పరిమితమవడంతో భవిష్యత్తులో జగన్ తో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని టీఆర్ఎస్ అంచాన వేస్తోంది.ఇలాంటి అంచానల కారణంగా కేసీఆర్ .. జగన్ కు మద్దతు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు