Tomorrow Bank Holiday On Occasion Of Muharram: ఉత్తరఖంఢ్లో ఈరోజు జూలై 16న కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈరోజు హరేలా అనే స్థానిక హిందూ పండుగ సందర్భంగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సెలవు ప్రకటించారు.
Bank Holiday Tomorrow On Occasion Of Muharram: రేపు అంటే బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ. అందుకే మీకు ఏమైనా బ్యాంకు లావాదేవీలు ఉంటే ఈరోజే ఆ పనులు పూర్తి చేసుకోండి. రేపు జూలై 17న ఎందుకు అన్ని పబ్లిక్, ప్రైవేటు సెక్టారు బ్యాంకులు సెలవుదినంగా పాటిస్తున్నాయో తెలుసుకుందాం.
మొహర్రం అనేది ముస్లిములకు అత్యంత పవిత్రమైన దినం వారికి కొత్త సంవత్సరంగా పాటిస్తారు. రేపు 2024 జూలై 17 మొహర్రం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా త్రిపుర, మిజోరాం, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా బ్యాంకులకు బంద్.
ఉత్తరఖంఢ్లో ఈరోజు జూలై 16న కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈరోజు హరేలా అనే స్థానిక హిందూ పండుగ సందర్భంగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సెలవు ప్రకటించారు. నెగోషియబుల్ ఇన్స్టుమెంట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్టుమెంట్ యాక్ట్, రీయల్ టైమ్ గ్రాస్ సెట్టిల్మెంట్ హాలిడే, బ్యాంకు క్లోజింగ్ అకౌంట్స్ ఈ మూడు సందర్భాల్లో ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులకు సెలవు లభిస్తుంది.
మొహర్రం సందర్భంగా రేపు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా కూడా సెలవు దినంగా పాటిస్తున్నారు. బీఎస్ఈ వెబ్సైట్ లో అధికారికంా ఈ సెలవు గురించి ప్రకటించారు. అయితే, బ్యాంకులో ఏవైనా మీకు పనులుంటే ఈరోజు వెంటనే పూర్తి చేసుకోవడం మేలు.
మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా రేపు అంటే బుధవారం జూలై 17న సెలుదినంగా ప్రకటించారు. ఇది కాకుండా రేపు తొలిఏకాదశి కూడా ఉంది. అయితే, బ్యాంకులకు ఈ సెలవులు కాకుండా ప్రతి రెండు, నాలుగో శనివారం, ప్రతి ఆదివారం కూడా సెలవులు వస్తాయి.