Dengue Mosquitoes: ఇంట్లో డెంగ్యూ దోమలు ఎక్కడెక్కడ ఉండే అవకాశాలుంటాయో తెలుసా

Dengue Mosquitoe Places: వర్షాకాలం ప్రారంభం కావడంతోనే డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. డెంగ్యూ అనేది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైపోతుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2024, 09:04 PM IST
Dengue Mosquitoes: ఇంట్లో డెంగ్యూ దోమలు ఎక్కడెక్కడ ఉండే అవకాశాలుంటాయో తెలుసా

Dengue Mosquitoe Places: వర్షాకాలంలో సహజంగానే డెంగ్యూ ముప్పు అథికంగా ఉంటుంది. ఎడిస్ ఇజిప్టీ అనే దోమ కారణంగా డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంది. ఇది వాస్తవానికి పగటి దోమ. అంటే రాత్రి కుట్టే దోమలతో డెంగ్యూ రాదు. పగలు కుట్టే దోమలతోనే డెంగ్యూ వ్యాధి ఎటాక్ కావచ్చు. అసలీ డెంగ్యూ కారక దోమలు ఎక్కడెక్కడ ఉంటాయనేది తెలుసుకుందాం

డెంగ్యూ దోమలు శుభ్రమైన నీటిలో పెరుగుతాయి. అందుకే ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎలాంటి చోట్ల ఈ డెంగ్యూ కారక దోమలుండే అవకాశాలున్నాయో చూద్దాం. ఇంట్లో కూలర్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కూలర్ నీళ్లలో ఈ డెంగ్యూ కారక దోమలు వృద్ధి చెందుతాయి. అందుకే వారానికి 2 సార్లు నీళ్లను మార్చ్ క్లీన్ చేస్తుండాలి. ఇంట్లో కొంతమంది పాత టైర్లు వదిలేస్తుంటారు. అందులో నీళ్లు చేరి దోమలు వృద్ధి చెందుతాయి. అందుకే టైర్ల లాంటి వస్తువులున్నప్పుడు పూర్తిగా కవర్ చేస్తుండాలి.

మొక్కలు పెంచుకునే కుండీల్లో నీళ్లు చేరకుండా, నిల్వ లేకుండా చూసుకోవాలి. నీళ్లు కుండీ కింద అమర్చే ప్లేట్లలో కాకుండా నేరుగా మట్టిలోనే నీళ్లు పోస్తుండాలి. సాధారణంగా చాలావరకూ ఫ్రిజ్‌ల వెనుక నీళ్లు చేరుతుంటాయి. ఈ నీళ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేకపోతే నీళ్లలో దోమలు చేరుతాయి. నీళ్ల ట్యాంకుల్ని ఎప్పుడూ కవర్ చేసి ఉంచాలి. లేకపోతే వీటిలో చాలా సులభంగా దోమలు చేరి వృద్ధి చెందుతాయి. 

బాత్రూంలో కూడా నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత బకెట్ లేదా టబ్‌లో నీళ్లు లేకుండా ఖాళీగానే ఉంచుకోవాలి. వీలైనంతవరకూ షవర్ వాడితే మంచిది. బాల్కనీలో ఉంచే కుండీలు, ఆట వస్తువలు, విరిగిన వివిధ రకాల వస్తువుల్లో నీళ్లు చేరకుండా చూసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పెంపుడు జంతువుల ప్లేట్లను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీళ్లు నింపుతుండాలి. వీటితో పాటు ఇంట్లో వీలైనంతవరకూ దోమల తెర వాడటం మంచిది. శరీరం అంతా కప్పే దుస్తులు ఎక్కువగా ధరించాలి. జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, వాంతులు లేదా విరేచనాలు వంటి సమస్యలుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే డెంగ్యూని ప్రారంభదశలో సులభంగా నియంత్రించవచ్చు.

Also read: Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే డయాబెటిస్ కంట్రోల్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News